logo

ఓటేయండి.. భవితకు బాటేయండి

పోలింగ్‌ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని  సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Published : 24 Apr 2024 02:56 IST

స్ఫూర్తి

న్యూస్‌టుడే, నయీంనగర్‌: పోలింగ్‌ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని  సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. త్రినగరిలో ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపడుతున్న ఆయన మంగళవారం హనుమకొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న యువతకు ఓటుపై అవగాహన కల్పించారు. రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలంటే యువత నడుం బిగించాలని కోరారు. ఓటుహక్కు తమ బాధ్యత అని ప్లకార్డులు ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని