logo

నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!

జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్‌సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్‌సభలో కలిపారు.

Published : 24 Apr 2024 02:59 IST

న్యూస్‌టుడే, జనగామ టౌన్‌: జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్‌సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్‌సభలో కలిపారు. తొలుత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హనుమకొండ, వరంగల్‌ పేరిట ఎంపీ నియోజకవర్గాలు ఉండేవి. పునర్విభజన తర్వాత హనుమకొండ స్థానంలో మహబూబాబాద్‌ కొత్త ఎంపీ నియోజకవర్గంగా ఆవిర్భవించగా వరంగల్‌ అలాగే కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గత భారాస ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా నల్గొండ నుంచి సూర్యాపేట, యాదాద్రి భువనగిరిని నూతన జిల్లాలుగా ఏర్పాటు చేసింది. జనగామను యాదాద్రి జోన్‌లోకి మార్చింది. తొలుత ఎంపీ స్థానం పరంగా భువనగిరిలోకి మారిన జనగామ, ఆ తర్వాత కొత్త జోనల్‌ వ్యవస్థలో కూడా యాదాద్రిలోనే కలవడం విశేషం. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా తొలుత జనగామను జిల్లాగా మార్చకుండా యాదాద్రి-భువనగిరిలో చేరుస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ప్రజా ఉద్యమాల ఫలితంగా జనగామను జిల్లాగా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో ఎంతో కాలంగా ఉన్న అనుబంధాన్ని వదులుకుని జనగామ పూర్తిగా భువనగిరి పార్లమెంటు, యాదాద్రి జోనల్‌లో కలిసిపోయింది.

 

 

 

 

జనగామ శాసనసభ నియోజకవర్గం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని