logo

ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం

మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్‌ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.

Published : 25 Apr 2024 04:10 IST

కొత్తగూడ, న్యూస్‌టుడే: మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్‌ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు. ఆంగ్లమాధ్యమంలో ఇంటర్‌ మొదటి ఏడాది ప్రారంభించి గతేడాది ఇంటర్‌ మొదటి ఏడాది ఫలితాల్లో 34మంది విద్యార్థినులకు 34మంది ఉత్తీర్ణత పొందారు. ఈ ఏడాది ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ 34 మంది ఉత్తీర్ణతను సాధించారు. ఇంటర్‌ మొదటి, ద్వితీయ ఫలితాల్లో నూరుశాతం ఫలితాలను కైవసం చేసుకుని జిల్లాలోనే ఉత్తమ గురుకులంగా కీర్తి చాటారు. సొంత భవనం పూర్తికాకపోవడంతో గంగారంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో కొనసాగింది. గత నెల మార్చిలో మంత్రి సీతక్క గంగారం కేజీబీవీ గురుకులాన్ని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన భవనంలో తరగతులు కొనసాగనున్నాయి. ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి పాఠ్యాంశంపై సాధన చేయించడంతో ఈ ఫలితాలు సాధ్యమైనట్లు ఎస్‌వో గంగారం కేజీబీవీ వంక సుజాత పేర్కొన్నారు.

కురవి: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో కురవి, సీరోలులోని ఏకలవ్య గురుకులాల్లో వంద శాతం ఉత్తీర్ణతతో విద్యార్థినులు సత్తాచాటారు.  సీరోలు ప్రథమ సంవత్సరం 86 మంది విద్యార్థినులు, ద్వితీయ సంవత్సంలో 84 మందికి 84, కురవిలో ప్రథమ సంవత్సరం 84కు 84, ద్వితీయ సంవత్సరం 81 మందికి 81 మంది. పాసయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని