logo

‘వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నాశనం’

వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని నరసాపురం పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.

Published : 29 Apr 2024 02:57 IST

కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో శ్రీనివాస వర్మ, పితాని

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని నరసాపురం పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. సిద్ధాంతంలో ఆచంట నియోజకవర్గ కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ అధ్యక్షతన సుబ్బరాజు ఫంక్షన్‌ హాలులో కార్యకర్తల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వర్మ మాట్లాడుతూ సైకో ప్రభుత్వాన్ని ఓడించడానికి తెదేపా, భాజపా, జనసేన కలిసి కూటమిగా ఏర్పడ్డాయన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి మధ్య జరుగుతున్నాయని చెప్పారు. గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అనంతరం పితాని సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో మట్టి, ఇసుక, మద్యం, ల్యాండ్‌ మాఫియా అరాచకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వైకాపా ప్రభుత్వం డబ్బు మదంతో ఉందని ఓటుకు రూ.3 వేలు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారని, వాటిని తీసుకుని కూటమికి ఓటు వేయాలని చెప్పారు. దుర్మార్గపు పాలన అంతమొందించడానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. నాయకులు పాక సత్యనారాయణ, నార్ని తాతాజీ, కోమటి రవికుమార్‌, పీవీఎస్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు కాపు కల్యాణ మండపానికి రూ.కోటి సాయం చేస్తానని మోసం చేశాô[ని, కూటమి అధికారంలోకి రాగానే నిధులు వచ్చేలా కృషి చేయాలని కోరుతూ శ్రీనివాస వర్మ, పితాని సత్యనారాయణలకు కాపు సంఘ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని