logo

వివాదాలకు అవకాశం ఇవ్వొద్దు: కలెక్టర్‌

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

Published : 29 Apr 2024 03:03 IST

నేడు నామినేషన్ల ఉపసంహరణ

వర్చువల్‌ సమావేశంలో సుమిత్‌కుమార్‌ తదితరులు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో ఆయన సోమవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థులకు గుర్తులు కేటాయించి వారికి తెలియజేయాలన్నారు. బ్యాలెట్‌పై అభ్యర్థి పేరు ఎలా ఉండాలో వారు సూచించిన విధంగానే నమోదు చేసుకోవాలన్నారు.  సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌ఆదిత్య, డీఆర్వో ఉదయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియపై ఏమైనా సందేహాలుంటే జిల్లా అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని ఆర్వోలకు సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని