logo

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు రాగి జావ అందించనున్నామని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు.

Published : 22 Mar 2023 01:57 IST

విద్యార్థినికి రాగిజావ అందిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు, పక్కన రాష్ట్ర ఆహార సలహా మండలి ఛైర్మన్‌ విజయ్‌ప్రతాప్‌రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు లక్ష్మీదేవి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు రాగి జావ అందించనున్నామని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళ వారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాగిజావ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, కడప కలెక్టరేట్‌లోని దృశ్యమాధ్యమ కేంద్రంలో కలెక్టర్‌ విజయరామరాజు, ఆహార సలహామండలి ఛైర్మన్‌ విజయ్‌ప్రతాప్‌రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు లక్ష్మీదేవి విద్యార్థులకు రాగిజావ అందించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 2,048 పాఠశాలల్లోని 1,48,804 మంది విద్యార్థులకు వారంలో మూడు రోజులు రాగిజావ అందిస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్దలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. అన్ని రకాల సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రాఘవరెడ్డి, ఏపీవో ప్రభాకర్‌రెడ్డి, పలువురు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని