logo

ఆర్టీపీపీలో ఉద్యోగోన్నతికి అడ్డదారులు

డాక్టర్‌ ఎంవీఆర్‌ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో కొందరు ఉద్యోగులు ఉద్యోగోన్నతికి అడ్డదారులు తొక్కుతున్నారు.

Published : 23 Apr 2024 05:13 IST

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం: డాక్టర్‌ ఎంవీఆర్‌ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో కొందరు ఉద్యోగులు ఉద్యోగోన్నతికి అడ్డదారులు తొక్కుతున్నారు. అకౌంట్స్‌ విభాగంలో ఓ సీనియర్‌ సహాయకులు ఉద్యోగోన్నతి వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. వైద్య విభాగంలో ఉద్యోగిగా పని చేస్తూ ఆ విభాగం నుంచి అకౌంట్స్‌ విభాగంలోకి కొన్నేళ్ల కిందట మారారు. ఉద్యోగోన్నతిలో భాగంగా  జేఏవో స్థాయికి ఇటీవల దరఖాస్తు చేశారు. వైద్య విభాగంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు, డిగ్రీ కోర్సులు సమాంతరంగా చదవడం చట్టరిత్యా నేరమని సహ ఉద్యోగులు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. వైద్య విభాగం నుంచి అకౌంట్స్‌ విభాగంలోకి మార్పు జరిగే సమయంలోనే విద్యాభ్యాసం ధ్రువీకరణ పత్రాలను ఉద్యోగోన్నతి కమిటీ పరిశీలించాల్సి ఉంది. ఈ కమిటీ పరిశీలించకపోవడంతో ఓ యూనియన్‌లోని కీలక నేత సహకారంతో ఉద్యోగోన్నతి పొందినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.  ఈ వ్యవహారంపై ఆర్టీపీపీ చీఫ్‌ ఇంజినీరు(సీఈ) గౌరీపతిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా విద్యాభ్యాస సర్టిఫికేట్లను పరిశీలన నిమిత్తం పంపినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని