logo

జగన్‌ దంపతులొచ్చి ప్రచారం చేసినా గెలుపు నాదే

ఈ నెల 25వ తేదీన నామినేషన్‌ తర్వాత తలపెట్టిన కూటమి ర్యాలీ విజయవంతమైనందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Published : 28 Apr 2024 05:33 IST

మాట్లాడుతున్న కూటమి జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: ఈ నెల 25వ తేదీన నామినేషన్‌ తర్వాత తలపెట్టిన కూటమి ర్యాలీ విజయవంతమైనందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం స్థానిక భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జగన్‌రెడ్డి, భారతి, అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలోనే వివేకానందరెడ్డి హత్య జరిగిందని.... సీబీఐ కూడా అదే చెబుతోందని ఆరోపించారు. నిందితులు ఆ సమయంలో ఎవరి దగ్గర ఉన్నారో దివంగత ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తమ్ముళ్లకు తెలియదా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి తరపున వైఎస్‌ తమ్ముళ్లు అయిన సుధీకర్‌రెడ్డి, రవీంద్రనాథరెడ్డి...అవినాష్‌రెడ్డి తరపున ప్రచారం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణా, మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతునాయన్నారు. వానలు లేకపోయినా జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. రాజోలి, గండికోట జలాశయం బాధితులకు పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో జగన్‌రెడ్డి దంపతులు వచ్చి ప్రచారం చేసినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. కూటమిని గెలిపిస్తే మెడికల్‌, ఇంజినీరింగ్‌, నర్సింగ్‌, అగ్రికల్చర్‌ కళాశాలలు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకుడు రాజేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రజకుల ఆత్మీయ సదస్సులో ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ  వైకాపా ప్రభుత్వం రజకులను ఏ మాత్రం ఆదుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రజకుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్‌ కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించడంతో పేద మధ్యతరగతి, వివిధ కుల సంఘాలు వెనబడ్డాయన్నాని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, రజక సంఘం నాయకులు తొర్రివేముల చెన్నప్ప, చెలో రవి, లక్ష్మీదేవి, చెన్నప్ప, పిచ్చయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు