logo

Kavitha: చాలా దారుణమైన వ్యాఖ్యలు.. తీన్మార్‌ మల్లన్నను సస్పెండ్‌ చేయాలి: కవిత

Eenadu icon
By Telangana Dist. Team Updated : 13 Jul 2025 17:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. మల్లన్నపై శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాలు ఉపయోగించి ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు.

‘‘తెలంగాణలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. బోనం ఎత్తుకున్న ఆడబిడ్డను అమ్మవారిలా చూసే సంస్కృతి మనది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మహిళలు రాజకీయాల్లోకి వస్తూ ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు పరుషపదజాలంతో విమర్శలు చేస్తే వచ్చేవాళ్లు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఉచ్ఛరించలేని దారుణమైన వ్యాఖ్యలను మల్లన్న చేశారు. ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావద్దా?ఏదైనా ఉంటే అంశం ప్రాతిపదికన మాట్లాడాలి తప్ప ఏం మాటలివి? దాదాపు ఏడాదిన్నరగా బీసీ సమస్యలపై తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తున్నాం. ఏ రోజూ తీన్మార్ మల్లన్నను ఒక్క మాట కూడా అనలేదు. నన్ను ఆయన ఎందుకు అలా అన్నారో తెలియదు. 

తెలంగాణ ప్రజలు పరుష పదజాలాన్ని సహించరు. మల్లన్న చేసిన వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు వెళ్లారు. సామాన్యులపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఎందుకు?ఇది ప్రజాస్వామ్యం. దీనిలో అనేకమంది ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నాయి. జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది.. అందులో బీసీ ఉద్యమం ఒకటి. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం. నాలాంటి వాళ్లను కోట్లాది మందిని తయారు చేస్తా. తక్షణమే తీన్మార్‌ మల్లన్నను సీఎం రేవంత్‌ అరెస్ట్‌ చేయించాలి. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తాం’’ అని కవిత అన్నారు.

డీజీపీకి కవిత ఫిర్యాదు

తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి కవిత ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో ఆమె డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags :
Published : 13 Jul 2025 16:09 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు