icon icon icon
icon icon icon

మోదీ రోడ్‌ షో చేసినా, ఎయిర్‌ షో చేసినా ఏమీ మారదు: తేజస్వీ యాదవ్‌

దేశంలో హిందువుల జనాభా తగ్గి ముస్లిం జనాభా పెరుగుతున్నట్లు ‘ఈఏసీ-పీఎం’ ఇచ్చిన నివేదికపై తేజస్వీ యాదవ్‌ ప్రశ్నలు లేవనెత్తారు.

Published : 09 May 2024 16:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పట్నా: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi) పట్నాలో రోడ్‌ షో చేసినా, ఎయిర్‌ షో చేసినా మార్పు ఏమీ ఉండదని ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Tejashwi yadav) అన్నారు. ఈనెల 12న మోదీ రోడ్‌షో గురించి విలేకర్లు ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు. దేశంలోనే కాకుండా బిహార్‌లోనూ ఎన్డీయే ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని అభిప్రాయపడ్డారు. తమ ‘ఇండియా’ కూటమి జాబ్‌ షో గురించి మాట్లాడుతోందని అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు.

యోగి పర్యటనలో బుల్‌డోజర్ల బ్రేక్‌డ్యాన్స్‌..!

జనగణన చేయకుండా అదెలా?!

దేశంలో హిందువుల జనాభా తగ్గి, ముస్లిం జనాభా పెరుగుతున్నట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి (ఈఏసీ-పీఎం) ఇచ్చిన నివేదికపై తేజస్వీ యాదవ్‌ సందేహాలు లేవనెత్తారు. జనగణన కూడా చేయకుండా కేంద్రం హిందూ, ముస్లిం జనాభాను ఎలా నిర్ణయించిందని ప్రశ్నించారు.  ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రం హిందువులు, ముస్లింల మధ్య చీలికలు సృష్టిస్తోందని ఆరోపించారు. 2021లో చేయాల్సిన జనగణన చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ గానీ, భాజపా నేతలు గానీ దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇతర కీలక అంశాలపై స్పందించరని.. బిహార్‌కు ప్రత్యేక హోదా గురించీ మాట్లాడరన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్రం కేవలం సమాజంలో ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందంటూ తేజస్వీ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కూడా మార్చాలనుకొంటున్నారని.. సమాజంలో చీలికలను సృష్టించేందుకు తాము అనుమతించబోమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని