ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది.

Updated : 29 Apr 2024 13:14 IST

దిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) తీర్పును యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై మే 9లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్‌ దాఖలుకు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సమయం కోరగా.. సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని