Tirumala: మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు వద్ద చిరుత కదలికలు

తిరుమల నడక మార్గంలో చిరుత బాలికపై దాడిచేసి, ప్రాణాలు తీసిన నేపథ్యంలో అటవీ పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. చిరుతను బంధించేందుకు అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌ చిరుత ముమ్మరంగా సాగుతోంది.

Updated : 13 Aug 2023 11:02 IST

తిరుమల: తిరుమల నడక మార్గంలో లక్షిత అనే బాలికపై చిరుత దాడిచేసి ప్రాణాలు తీసిన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. చిరుతను బంధించేందుకు అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌ చిరుత ముమ్మరంగా సాగుతోంది. బాలికపై చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. ట్రాప్‌ కెమెరాలతో చిరుత కదలికలను అటవీశాఖ పర్యవేక్షిస్తోంది. 

Cheetah attack in Tirumala: అలిపిరి దారిలో చిరుత దాడి

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెహికల్‌ సైరన్‌ వేసి చిరుతను విజిలెన్స్‌ సిబ్బంది అడవిలోకి తరిమినట్లు చెప్పారు. కాలినడకన వెళ్లే భక్తులను కట్టుదిట్టమైన భద్రత మధ్య గుంపులుగా పంపిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి అలిపిరి నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత (6)పై చిరుత దాడిచేసి అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి చంపేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని