KCR: భారాస అధినేత కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

Published : 16 Apr 2024 23:20 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత జి.నిరంజన్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ నేతలను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన ఈసీ.. గురువారం ఉదయం 11 గంటలలోపు వివరణ ఇవ్వాలని పేర్కొంటూ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని