holidays for schools: భారీ వర్షాలు.. తెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది.

Updated : 27 Jul 2023 12:40 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు బుధ, గురువారాలు సెలవు ప్రకటించాయి. తాజాగా ఆ సెలవులను శుక్రవారం వరకూ పొడిగించారు. మరోవైపు శనివారం మొహర్రం, ఆ తర్వాత ఆదివారం ఇలా విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చినట్లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని