Gold: కలపర్రు టోల్‌గేట్‌ వద్ద భారీగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

ఏలూరు జిల్లాలో భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 08 Apr 2024 15:02 IST

పెదపాడు: ఏలూరు జిల్లాలో భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు మండలం కలపర్రు టోల్‌ ప్లాజా వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా ఓ కారులో 50 కేజీలకు పైగా ఆభరణాలను గుర్తించారు. వీటిలో సుమారు 22 కేజీల బంగారం, 31 కేజీల వెండి ఉన్నాయి. 

పెదవేగి సీఐ శ్రీనివాస్‌కుమార్‌ మాట్లాడుతూ విజయవాడ నుంచి భీమవరానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేశామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు హనుమాన్‌ జంక్షన్‌ నుంచి వాహనంలో తరలిస్తున్న రూ.15లక్షల నగదును సీజ్‌ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును పీఎస్‌కు తరలించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని