
Published : 17 Jan 2022 01:25 IST
Offbeat : కొత్త అల్లుడికి 365 వంటకాలతో భోజనం... ఎక్కడంటే?
నరసాపురం: గోదారోళ్లు అంటే ఆతిథ్యానికి మారుపేరు. అందులోనూ సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. ఇక కొత్త అల్లుళ్లకైతే.. ఆ మర్యాదల గురించి చెప్పక్కర్లేదు. అయితే.. పశ్చిమగోదావరిలో ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి 365 రకాల పిండివంటలతో ఆతిథ్యమిచ్చింది. అన్నం, పులిహోర, బిర్యానీ, దద్యోదనం వంటి వంటకాలతో పాటు, 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీమ్‌లు, 35 రకాల శీతల పానీయాలు, 15 రకాల కేకులతో.. భోజనం పెట్టారు. ఈ భారీ భోజనం గురించి పూర్తి వివరాలు ఈ దిగువ వీడియోలో...!
ఇవీ చదవండి
Tags :