East Godavari: పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్‌

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated : 02 May 2024 15:39 IST

తాళ్లపూడి: పింఛన్‌ల పంపిణీపై జగన్‌ ప్రభుత్వం పన్నిన పన్నాగం వల్ల వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల్లో చాలా మందికి తమ ఖాతాల్లో పింఛన్‌ డబ్బు జమ కాకపోవడంతో లబోదిబో మంటున్నారు.  తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో 7,989 పింఛన్లకుగాను 2,377 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ అందజేశారు. మిగిలిన 5,612 మందికి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశామని చెప్పడంతో వారంతా బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు.

అన్నదేవరపేటలో బ్యాంకు ఆఫ్‌ ఇండియా వద్దకు ఉదయాన్నే చేరుకున్నారు. తాళ్లపూడిలోని యూనియన్ బ్యాంకు వద్ద పింఛన్‌దారులతో రద్దీ నెలకొంది. ప్రక్కిలంకలోని స్టేట్ బ్యాంకు వద్ద బారులు తీరారు. లబ్ధిదారుల బ్యాంకుఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, జీరోబ్యాలెన్సు ఉండటం, వారి ఖాతాల లావాదేవీలు జరగకపోవడం తదితర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం పింఛన్‌దారులను ఇబ్బందులకు గురిచేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని