TS News: నార్సింగ్‌లోని ప్రైవేటు కళాశాలలో 14 మంది విద్యార్థులకు కరోనా

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ నార్సింగ్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో 93 మంది విద్యార్థులకు ఆరోగ్య సిబ్బంది ర్యాపిడ్‌ టెస్టులు

Updated : 28 Dec 2021 21:16 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ నార్సింగ్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో 93 మంది విద్యార్థులకు ఆరోగ్య సిబ్బంది ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా ..14  మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.  బుధవారం మరోసారి వీరికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ టెస్టులు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

కొత్తగా 228 కరోనా కేసులు.. ఒకరి మృతి

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,678 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 228 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,072కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,024కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 185 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,828 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని