Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 24 Apr 2023 09:00 IST

1. చంద్రబాబుపై రాళ్ల దాడి.. ఆ మూడో వ్యక్తి ఎవరు?

‘చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న రాళ్ల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరు జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు, ఇంకొకరు కంభంపాడు సర్పంచితో పాటు ‘మరో వ్యక్తి’ ఉన్నారు..’ అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ యర్రగొండపాలెంలో శనివారం విలేకర్లతో చెప్పిన విషయం ఇది. ఆ ‘మూడో వ్యక్తి’ ఎవరనే ప్రశ్న ఇప్పుడు వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఔటర్‌ చుట్టూ ఎంఎంటీఎస్‌ వస్తే..! రాకపోకలు సులభం

తక్కువ టిక్కెట్‌ ధరతో ప్రయాణికులకు సేవలందిస్తున్న ఎంఎంటీఎస్‌ల విస్తరణ నగరానికి ఎంతో అవసరం. దేశ జనాభాలో అగ్రగామిగా నిలిచిన భారత్‌కు ప్రజారవాణా అందుబాటులో ఉంటే ఎంతోమందికి ఉపాధికి కరవుండదు.  శివార్లలో తక్కువ అద్దెలకు ఉంటూ.. నగరంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేసుకోవచ్చు. ఎంఎంటీఎస్‌ రెండో దశతో 100 కిలోమీటర్లు అందుబాటులోకి రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దేవుడి దర్శనానికొస్తే.. చుక్కలు చూపించారు

అప్పన్న స్వామి నిజరూప దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసల కోర్చి సింహాచలం చేరుకున్న భక్తులకు అధికారులు దేవుడ్ని చూపించకపోయినా చుక్కలు మాత్రం చూపించారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కర్ని కదిపినా.. స్వామి దర్శనాన్ని సంతృప్తిగా చేసుకోలేకపోయామన్న భావనే.  యంత్రాంగం నిర్వహణా లోపాలు ప్రతీ చోటా కొట్టొచ్చినట్లు కనిపించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హాస్యనటుడు చలాకీ చంటికి గుండెపోటు

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: హాస్యనటుడు చలాకీ చంటి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో ఈ నెల 21న  కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా గుర్తించారు. అవసరమైన పరీక్షలు నిర్వహించి.. రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేలడంతో వైద్యులు స్టంట్‌ వేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

5. వేచి చూద్దాం.. ఆ తర్వాత నిలిపేద్దాం

ప్రైవేట్‌ వైద్యం సామాన్యులకు భారమైన పరిస్థితుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ఆదరువుగా మారింది. అదికాస్తా ఇప్పుడు మసకబారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడం ఇందుకు కారణం. గతంలో నెల, రెండు నెలల ఆలస్యంగా ఆన్‌లైన్‌ ద్వారా ఆసుపత్రులకు డబ్బులు జమ చేసేవారు.. ఈసారి ఏకంగా డిసెంబర్‌ నుంచి కొన్ని ఆసుపత్రులకు, జనవరి నుంచి అన్నింటికీ నిధుల విడుదల ఆగిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అటు సమ్మేళనం.. ఇటు నిరసన గళం

ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ పయనంపై రకరకాల ప్రచారాలు రాజకీయంగా కాక రేపుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఒకేరోజు రెండు పార్టీల ముఖ్య నేతల పర్యటన వేసవిలో మరింత వేడి పుట్టిస్తోంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆస్తులు రాసిస్తా.. రాజకీయాల్లోంచి తప్పుకొంటా

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌లో తన వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డి ద్వారా పెట్టుబడులు పెట్టానంటూ విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ఆరోపించారని, ఆ సంస్థతో తనకెలాంటి సంబంధమూ లేదని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులోని తన నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూర్తియాదవ్‌ ఆరోపణల నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జాతీయ స్థాయిలో పరువు పోయే... రాష్ట్రంలో కాపాడుకునే యత్నం

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఈ ఏడాది ప్రకటించిన ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుల్లో ఒక్కటీ దక్కించుకోని వైకాపా ప్రభుత్వం..తన పరువు కాపాడుకునేందుకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసింది. మూడేళ్లలో ఏనాడూ ఆ ఊసే ఎత్తకుండా ఇప్పుడు 27 పంచాయతీలకు అవార్డులు ప్రకటించింది. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచులకు సోమవారం అవార్డులు అందజేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ముందు తరగతులు.. తర్వాతే అనుమతులు

రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలలు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు లేకుండానే ఆ బోర్డులు తగిలిస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాల ఏర్పాటుకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకుని, ఆ తర్వాత  అనుబంధ గుర్తింపు కోసం సీబీఎస్‌ఈ బోర్డుకు దరఖాస్తు చేసుకోకుండానే సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికతో తరగతులు ప్రారంభిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటోందన్న విమర్శలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.NIPER: నైపర్‌ సీటుకు పోటీ పడతారా?

దేశంలో ఫార్మా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ఫార్మా సంస్థలు ఔషధాల తయారీలో భాగమవుతున్నాయి. ఎక్కువమంది ఇందులో ఉపాధీ పొందుతున్నారు. ఈ రంగంలో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైనది నైపర్‌ జేఈఈ. ఇందులో సాధించిన స్కోరుతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌)ల్లో ప్రవేశం లభిస్తుంది. ఫార్మసీ చదువుల్లో జాతీయ ప్రాధాన్య సంస్థలుగా వీటిని నెలకొల్పారు. ఇక్కడ వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థల్లో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. నైపర్‌ జేఈఈ-2023 ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని