Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 02 May 2024 08:59 IST

1. దోపిడీ విలువ రూ.4,080 కోట్లు

దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. బార్లు బార్లా తెరిచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా నాసిరకం మద్యం ప్రవేశపెట్టి.. ధరల్ని అమాంతం పెంచేసి.. మందుబాబుల ప్రాణాలతో చెలగాటం ఆడారు. పూర్తి కథనం

2. పిండేశారు!

కేంద్రం సహా పలు రాష్ట్రాలు పన్నులు తగ్గిస్తే.. జగన్‌ సర్కారు మాత్రం అయిదేళ్లుగా ఎడాపెడా బాదేస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు సగటున రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తూ.. ఇంటింటికీ తిరిగే చిరు వ్యాపారులు, అన్నం పెట్టే రైతుల ఆదాయానికి కత్తెరేస్తోంది. కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించుకునే చిరుద్యోగులు.. కార్లు, ఆటోలు, లారీలు నడుపుతూ కుటుంబాలను నెట్టుకొచ్చే వారి జేబుల్ని కొల్లగొడుతోంది.పూర్తి కథనం

3. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు?

‘నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్నాం.. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధనతో పాటు, టోఫెల్‌, స్లాష్‌, క్లాస్‌రూం ఎస్సెస్‌మెంట్‌ పరీక్షలు చేపడుతూ వారి సామర్థ్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతిలో పెంపొందిస్తున్నాం’ అని సీఎం జగన్‌ నిత్యం ఊదరగొడుతూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే విస్తుగొలుపుతోంది.పూర్తి కథనం

4. హైదరాబాద్‌లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘జనసేన’ పార్టీ గుర్తు ‘గాజుగ్లాసు’ను హైదరాబాద్‌లోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు కేటాయించారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న దాసరి సాహితికి జనసేన గుర్తు గాజుగ్లాసును ఇచ్చారు. పూర్తి కథనం

5. సారథులు.. ‘సేతు’లెత్తేశారు..!

వారంతా అధికార పార్టీ నాయకులు..ఐదేళ్ల పాటు కనీసం వారధులు కూడా నిర్మించలేకపోయిన సారథులు..గత ఎన్నికల్లో ఓట్లేయండి..మీ కష్టాలు తీర్చుతామంటూ ఊరూరా తిరిగి ఊదరగొట్టారు..అందలమెక్కి హామీల ఊసే మరిచారు..కాలం కరిగింది తప్ప వారి మనసు కరగలేదు..ప్రజల కష్టాలను సుడిగుండంలోనే వదిలేశారు..గత ప్రభుత్వంలో మంజూరైన వంతెనలైనా పూర్తి చేయలేకపోగా..గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా మధ్యలో నిలిచిపోయేలా చేశారు.పూర్తి కథనం

6. ఐదొందలిస్తే అదనపు సేవ

వైద్యులు ధ్రువీకరించినా.. రూ.500 ఇస్తేనే మీకు పిల్లలు పుట్టినట్టు ధ్రువీకరణ ఇస్తామంటూ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. కొన్ని మీసేవ కేంద్రాలు, కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు జనన, మరణ ధ్రువపత్రాల జారీని అవినీతిమయం చేశారు. ఆస్పత్రుల్లో జరిగే జనన, మరణాలకు యాజమాన్యం ఇచ్చే ధ్రువీకరణ ప్రామాణికమనే నిబంధన ఉన్నా.. అనవసరంగా అఫిడవిట్‌, ఇతర పత్రాలు కావాలని దరఖాస్తుదారులను వేధిస్తున్నారు.పూర్తి కథనం

7. రిజర్వేషన్లపై 50% కోటా పరిమితి ఎత్తివేస్తారా?

లోక్‌సభ ఎన్నికల ఘట్టంలో ఇంకా అయిదు విడతలు మిగిలి ఉండగా, రిజర్వేషన్ల కోటాపై ప్రధాన పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆ అంశాన్ని చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. బుధవారం గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని లిఖితపూర్వకంగా ప్రకటించగలరా? అని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు సవాలు విసరగా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై ఇపుడున్న 50% కోటా పరిమితి మీరు ఎత్తివేస్తారా? అనేది స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రతి సవాలు విసిరింది.పూర్తి కథనం

8. హస్తం చెంతకా.. కమలం గూటికా?

రాజధానిలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో భాజపా, కాంగ్రెస్‌లు గులాబీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి పోటీపడుతున్నాయి. ఇందుకు సామదాన దండోపాయాలను అవలంబిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి భాజపా ప్రయత్నాలు చేస్తుంటే.. కమలం పార్టీ కార్పొరేటర్లను ఈ వారంలో తమ పార్టీలో చేర్చుకోనున్నటు కాంగ్రెస్‌ అగ్రనేతలు చెబుతున్నారు. పూర్తి కథనం

9. రేవంత్‌ మహారాష్ట్ర.. కేసీఆర్‌ గుజరాత్‌!

నేతలు ఎన్నికల ప్రచారంలో చేసే ఉపన్యాసాలను పరిశీలిస్తే అంశం ఒకటే అయినా వారు వెల్లడించే విషయాలు భిన్నంగా ఉంటాయి. ఏప్రిల్‌ 24న హనుమకొండ మడికొండలో జరిగిన కాంగ్రెస్‌ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గత ఆదివారం వరంగల్‌ రోడ్‌ షోలో మాజీ సీఎం కేసీఆర్‌ ఒకే అంశంపై చేసిన విమర్శలు విభిన్నంగా ఉన్నాయి.పూర్తి కథనం

10. వారి ఓటును వారికి వేసుకోలేరు

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నివాసం రాజేంద్రనగర్‌ పరిధిలో ఉంటుంది. ఇది చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఎవరూ నిలబడటం లేదు. ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని