icon icon icon
icon icon icon

రిజర్వేషన్లపై 50% కోటా పరిమితి ఎత్తివేస్తారా?

లోక్‌సభ ఎన్నికల ఘట్టంలో ఇంకా అయిదు విడతలు మిగిలి ఉండగా, రిజర్వేషన్ల కోటాపై ప్రధాన పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆ అంశాన్ని చర్చనీయాంశంగా మారుస్తున్నాయి.

Published : 02 May 2024 04:40 IST

ప్రధాని స్పష్టత ఇవ్వాలన్న కాంగ్రెస్‌

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఘట్టంలో ఇంకా అయిదు విడతలు మిగిలి ఉండగా, రిజర్వేషన్ల కోటాపై ప్రధాన పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆ అంశాన్ని చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. బుధవారం గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని లిఖితపూర్వకంగా ప్రకటించగలరా? అని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు సవాలు విసరగా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై ఇపుడున్న 50% కోటా పరిమితి మీరు ఎత్తివేస్తారా? అనేది స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రతి సవాలు విసిరింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో గ్యారంటీ  ఇచ్చిందని, మోదీ దీనికి మతపరమైన రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లౌకిక భావాలకు, సామాజిక న్యాయానికి భాజపా, ఆరెస్సెస్‌ వ్యతిరేకమని.. అందుకే రాజ్యాంగాన్ని మార్చే హక్కు కోసం మోదీ ‘400 పార్‌’ అంటున్నారని జైరాం రమేశ్‌ పునరుద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని