Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jun 2024 09:14 IST

1. దూసుకెళ్లాం బ్రదర్‌..

ఎన్టీఆర్‌ జిల్లాతో పోలిస్తే కృష్ణాలో తెదేపా గట్టి పట్టు చూపించింది. ఒంటరిగానే 51.91 శాతం ఓట్లను చేజిక్కించుకుంది. ఈ జిల్లాలోనూ పోటీ చేసిన ఆరు స్థానాల్లోనూ భారీ ఆధిక్యాలు సాధించింది. అవనిగడ్డ నుంచి పోటీ చేసిన జనసేన జిల్లాలో మొత్తం పోలైన ఓట్లలో 8.68 శాతం దక్కించుకుంది. కూటమి పరంగా చూస్తే 60.59 శాతం ఓట్లతో తిరుగులేని ఆధిపత్యం చాటింది. బందరు లోక్‌సభ స్థానంలో జనసేన భారీ మెజారిటీ తెచ్చుకుంది. పూర్తి కథనం

2. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

సంజయ్‌ గెలిస్తేనే మళ్లీ కేంద్రంలో మోదీ సర్కారు వస్తుంది. ధర్మం నిలబడుతుందని నమ్మి నాకు ఓట్లు వేశారు. అందుకనే ఈసారి మరింత బాధ్యతతో నా నియోజకవర్గ ప్రజలకు మేలు చేసే వ్యక్తిగా నా కర్తవ్యాన్ని పక్కాగా నిర్వర్తిస్తా. నేను నాయకుడిని కాదు. పక్కా ప్రజల సేవకుడిని. కాంగ్రెస్, భారాసలు అబద్ధపు మాటలు, హామీలు ఇచ్చారు.పూర్తి కథనం

3. ‘పిన్నెల్లి’కి ముగుస్తున్న గడువు

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయకుండా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు గురువారం రాత్రితో ముగియనుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఆయన పలు దాడుల కేసుల్లో నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే.పూర్తి కథనం

4. చేతికి చిక్కని పాలమూరు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారాస లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు నాలుగు సార్లు పోటీ చేయగా మహబూబ్‌నగర్‌ స్థానంలో మూడుసార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. 2009 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించగా భారాస మూడుసార్లు, భాజపా ఒకసారి గెలుపొందాయి.పూర్తి కథనం

5. అమాత్యా.. అధ్యక్షా.. మీ సేవలు చాలు..!

జిల్లా పెద్దలుగా వ్యవహరించిన మంత్రులు, శాసనసభ సభాపతి ఘోర ఓటమిని చవిచూశారు.. సమస్యలు పట్టించుకోకపోవడం..ఒక్క అభివృద్ధిని విస్మరించడం, అవినీతి, అక్రమాల ఆరోపణలు వారిని మట్టి కరిపించాయి. పదవులు చేపట్టినప్పటి నుంచి స్వలాభం, వ్యాపారాలపైనే దృష్టిసారించారనే అపవాదు మూటకట్టుకున్నారు.పూర్తి కథనం

6. ‘అవినాష్‌కు చెక్‌పెట్టి భూపేష్‌ను ఎంపీగా నిలబెడతా’

 ‘జమ్మలమడుగు నియోజకవర్గాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నాశనం చేశారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి నన్ను ఇరికించారు. ఇప్పుడు ఆయనకు చెక్‌ పెట్టి జైలుకు పంపిస్తా. ఆ ఎంపీ స్థానం ఖాళీ అయితే భూపేష్‌రెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెడతా’ అని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం

7. ఎందుకు ఓడిపోయాం?

భారాస పార్టీకి ఉమ్మడి మెదక్‌ జిల్లా కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం మెదక్, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల ఫలితాలతో కారు జోరుకు బ్రేకులు పడటంతో ఎందుకు ఓడిపోయామనే అంతర్మథనం జరుగుతోంది. రాష్ట్రంలోనే గెలుపొందే సీట్లలో మెదక్‌ స్థానం తప్పక ఉంటుందని భావించారు. అంచనాలు తలకిందులయ్యాయి. పూర్తి కథనం

8. 39లో.. భారాసకు మూడుచోట్లే ఆధిక్యం

లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సాధించలేకపోయిన భారాసకు.. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కేవలం మూడు చోట్ల మాత్రమే ఆధిక్యం దక్కింది. రాష్ట్రంలో గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన భారాస.. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే మెజార్టీని కనబరిచింది.పూర్తి కథనం

9. జీతం తీసుకుంటా.. ప్రతి రూపాయికీ బాధ్యతగా పనిచేస్తా

ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. వచ్చిన ప్రతి ఓటూ మనకు బాధ్యతను గుర్తు చేసేదే. మనం ఐదు కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ విజేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.పూర్తి కథనం

10. దేశంలో మరిన్ని ఎయిర్‌స్క్రిప్ట్‌లు

దేశంలో విమాన అనుసంధానతను పెంచడం కోసం మరిన్ని ఎయిర్‌స్ట్రిప్‌లు (చిన్నపాటి విమానాశ్రయాలను) అభివృద్ధి చేయాలని పౌర విమానయాన శాఖ భావిస్తోంది. దీంతోపాటు పెద్ద, మధ్యస్థాయి విమానాశ్రయాలతో అనుసంధానానికి నిబంధనలను సవరించాలని చూస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి వుమ్లంగామ్‌ వూల్నమ్‌ పేర్కొన్నారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని