Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Apr 2023 13:10 IST

1. నేను కోర్టుకు హాజరైతే ట్రాఫిక్‌ ఇబ్బందులొస్తాయ్‌: కోడికత్తి కేసులో జగన్‌ పిటిషన్‌

2019 ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో వైకాపా అధినేత, సీఎం జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతోంది. విచారణకు హాజరుకావాలని గత వాయిదాలో మెజిస్ట్రేట్‌ పేర్కొన్న నేపథ్యంలో తాజాగా జగన్‌ పిటిషన్‌ వేశారు. అడ్వకేట్‌ కమిషనర్‌ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో సీఎం కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  పెండింగ్‌ బిల్లులపై గవర్నర్‌ తమిళిసై కీలక నిర్ణయం

పెండింగ్‌ బిల్లుల్లో మూడింటిని ఆమోదిస్తూ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పిపంపించగా.. ఇంకో రెండు బిల్లులను మాత్రం పెండింగ్‌లోనే ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  రింకు సింగ్‌ వాడిన బ్యాట్ నాదే.. తొలుత ఇవ్వొద్దనుకున్నా: రాణా

అంతా ఓటమి నిరాశలో కూరుకుపోయిన సమయంలో సహచరుల్లో ఉత్సాహం నింపిన బ్యాట్‌ అది.. చివరి ఐదు బంతులను మైదానం వెలుపలకు పంపించిన యువ బ్యాటర్‌ చేతిలోని ఆయుధం అది.. ఇదంతా ఏంటని కంగారు పడొద్దు. గుజరాత్‌ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను (GT vs KKR) గెలిపించిన రింకు సింగ్‌ వాడిన బ్యాట్‌ గురించే ఈ ఉపోద్ఘాతం. అయితే ఈ బ్యాట్‌ అతడిది కాదట. బ్యాట్‌ వెనుక ఉన్న రహస్యాన్ని కోల్‌కతా కెప్టెన్‌ నితీశ్ రాణా (KKR) వెల్లడించాడు. ఈ బ్యాట్‌ తనదేనని, తొలుత ఇవ్వకూడదని అనుకున్నట్లు చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారాస నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్‌

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని భారాస సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది. భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

థియేటర్లు: ఏప్రిల్‌ 14- సమంత ‘శాకుంతలం’, రాఘవ లారెన్స్‌ ‘రుద్రుడు’. ఏప్రిల్‌ 15- క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘విడుదల: పార్ట్‌-1’. ఓటీటీ: ఏప్రిల్‌ 12- ది సాంగ్‌ ఆఫ్‌ గ్లోరీ(ఎంఎక్స్‌ ప్లేయర్‌). ఏప్రిల్‌ 13- అబ్సెషన్‌(నెట్‌ఫ్లిక్స్‌), అసలు(ఈటీవీ విన్‌), ఓ కల(డిస్నీ+హాట్‌స్టార్‌), ఫ్లోరియా మాన్‌(నెట్‌ఫ్లిక్స్‌). ఏప్రిల్‌ 14- దాస్‌ కా ధమ్కీ(ఆహా), ది లాస్ట్‌ కింగ్‌డమ్‌(నెట్‌ఫ్లిక్స్‌), ది మార్వెలస్‌ మిస్సెస్‌(అమెజాన్‌), మిస్సెస్‌ అండర్‌కవర్‌(జీ5). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఘోరం.. ఆలయంలో కూలిన భారీ వృక్షం.. ఏడుగురు మృతి

మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆలయ (Temple) ప్రాంగణంలో భారీ వృక్షం కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అకోలా జిల్లాలోని బాబూజీ మహరాజ్‌ ఆలయంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మూల్పూరి కల్యాణిపై హత్య కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు: చంద్రబాబు

తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి అరెస్ట్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. కల్యాణిపై తప్పుడు కేసు పెట్టిందే కాక.. బెడ్‌రూంలోకి చొరబడి ఆమెను ఉగ్రవాదిలా అరెస్ట్‌ చేసిన విధానం దారుణమన్నారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలు ప్రశ్నించిన మహిళపై హత్య కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటని మండిప్డడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శంషాబాద్‌లో ఎయిరిండియా విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఈరోజు ఎయిరిండియా విమానాలు రద్దయ్యాయి. మొత్తం ఎనిమిది విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. తిరుపతి, బెంగళూరు, మైసూర్‌, హైదరాబాద్‌ విమానాలు రద్దు చేసినట్లు వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా చివరి నిమిషంలో విమానాలు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘సీతా రామం’ సీక్వెల్‌పై మృణాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మృణాల్ ఠాకూర్, దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) జంటగా నటించిన సినిమా ‘సీతా రామం’ (Sita Ramam). ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాలను అలరించిన ఈ చిత్రం సీక్వెల్‌ కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. క్లాసిక్‌ హిట్‌గా నిలిచిన ‘సీతా రామం’ సీక్వెల్‌పై మృణాల్‌ తాజాగా ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తైవాన్‌పై దాడి ఎలా..? సాధన చేస్తున్న చైనా..!

యుద్ధ నౌకలతో తమపై దాడులు చేయడానికి చైనా(China) సాధన చేస్తోందని తైవాన్‌(Taiwan) రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా తైవాన్‌ తూర్పు ప్రాంతంలో డ్రాగన్‌ యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సారి విన్యాసాల్లో తొలిసారి జె-15 ఫైటర్‌ జెట్‌లు దర్శనమిచ్చాయి. ఇవి పీఎల్‌ఏ నేవీకి చెందిన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్ల నుంచి ఎగిరి తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌ (ఏడీఐజెడ్‌)లోకి ప్రవేశించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని