Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Jul 2023 13:28 IST

1. ఆర్టికల్‌ 370 రద్దు పిటిషన్లు.. ఆగస్టు 2నుంచి పూర్తిస్థాయి విచారణ

జమ్మూ- కశ్మీర్‌ (Jammu Kashmir)లో ఆర్టికల్‌ 370 (Article 370) రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టు (Supreme Court)లో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వాటిని నేడు పరిశీలించిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఆగస్టు 2 నుంచి పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 2075 నాటికి అమెరికాను దాటనున్న భారత్‌

సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy) వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న 50 ఏళ్లలో భారత జీడీపీ (GDP) మరింత వేగంగా వృద్ధి నమోదు చేసే అవకాశముందని ప్రముఖ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ (Goldman Sachs) అంచనా వేసింది. 2075 నాటికి భారత్‌.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి (Second Largest Economy)గా అవతరించనుందని పేర్కొంది. అమెరికా (USA)ను దాటేసి ఈ ఘనత సాధిస్తుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మైక్రోసాఫ్ట్‌లో మరోసారి భారీ తొలగింపులు

పెద్ద పెద్ద టెక్‌ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు (Lay offs) ప్రక్రియలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది జనవరిలో 10 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి అదనంగా మరిన్ని కోతలకు సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం నుంచే ఈ తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కౌంటింగ్‌ కేంద్రం వద్ద పేలుడు.. బెంగాల్‌లో మళ్లీ ఉద్రిక్తత

 పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కొనసాగుతోంది. అయితే, పోలింగ్ రోజున చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలను దృష్ట్యా.. కౌంటింగ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. డైమండ్‌ హార్బర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంపైకి దుండగులు బాంబులు విసిరారు. అయితే ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు. హావ్‌డాలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని స్థానికులు ముట్టడించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. న్యాయవాద దంపతుల హత్య కేసు.. ఇద్దరు నిందితులకు బెయిల్‌

న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, పీవీ నాగమణిల హత్య కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు.. ఏ-3 లక్ష్మ, ఏ-5 కుమార్‌లకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ పిటిషన్లపై జస్టిస్‌ బోపన్న, జస్టిస్‌ సుందరేష్‌ ధర్మాసనం విచారణ చేపట్టగా.. తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసినట్లు నిందితుల తరఫు లాయర్లు తెలిపారు. స్థానిక కోర్టులో విచారణ జరుగుతున్నట్లు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 9 కి.మీ రాంగ్‌ రూట్‌లో వచ్చి కారును ఢీకొన్న స్కూల్ బస్సు.. ఆరుగురి మృతి

ఉత్తరప్రదేశ్‌ గాజియాబాద్‌లోని దిల్లీ - మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల బస్సు.. కారును ఢీకొన్న ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 6 గంటలకు ఓ స్కూల్ బస్సు దిల్లీ - మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రాంగ్‌ రూట్‌లో వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏపీ ఎన్నికల కమిషనర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు

ఏపీ ఎన్నికల కమిషనర్‌ ఎం.కె.మీనాను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దిల్లీకి పిలిచింది. సీఈసీ పిలుపుతో ఆయన దిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయని విపక్షాలు, ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలోనే ఆయన్ను దిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, స్థానిక యంత్రాంగం ఇష్టారీతిన ఓట్ల చేర్చడం, తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నేపాల్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఆరుగురి మృతి!

నేపాల్‌లో ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ గల్లంతైన ఘటన విషాదంగా మారింది. ఆ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఐదుగురు మెక్సికన్‌లతో సహా మొత్తం ఆరుగురు ఉన్నారని తెలిపారు. సోలుకుంభు నుంచి కాఠ్‌మాండూ(Kathmandu)కు ప్రయాణిస్తుండగా ఎవరెస్టు శిఖరం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఒడిశాలో పోలీసు పావురాలు.. విధి నిర్వహణలో సత్తా చాటాయి!

భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal nehru) 1948 ఏప్రిల్‌ 13న ఒడిశా రాష్ట్రం (Odisha) సంబల్‌పూర్‌ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ్నుంచి ఆయన 265 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్‌ వెళ్లాలనుకున్నారు. తన పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కటక్‌ అధికారులకు ఒక అత్యవసర సందేశం పంపించాల్సి వచ్చింది. ఎలా అని నెహ్రూ వాకబు చేస్తుండగా.. స్థానిక పోలీసులు ఓ పావురాన్ని తీసుకొచ్చి దాంతో ఆ సందేశం పంపిస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉచిత విద్యుత్‌ అడ్డుకోవాలన్నది కాంగ్రెస్‌ దుర్మార్గపు ఆలోచన: కేటీఆర్‌

రైతులకు ఉచిత విద్యుత్‌ రద్దు చేయాలని కాంగ్రెస్‌ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. గతంలోనూ రైతులకు విద్యుత్‌ ఇవ్వకుండా గోసపెట్టారని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ మరోసారి బయటపెట్టిందన్నారు. కాంగ్రెస్‌ ఆలోచనల్ని తెలంగాణ రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచనా విధానాలపై ఇవాళ, రేపు భారాస నిరసనలకు పిలుపునిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని