Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 10 Apr 2023 17:07 IST

1. హిందీ ‘పేపర్‌ లీక్’ అనే మాట అబద్ధం.. అది ‘మాల్ ప్రాక్టీస్‌’: ఈటల రాజేందర్ 

పదో తరగతి హిందీ పేపర్‌ లీక్‌ మాట పచ్చి అబద్ధమని.. అది మాల్‌ ప్రాక్టీస్‌ అవుతుందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. పేపర్‌ బయటకు వచ్చిన ఘటనపై సోమవారం వరంగల్‌ డీసీపీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా సెల్‌ఫోన్‌ తీసుకుని డీసీపీ వద్ద ఈరోజు విచారణకు హాజరయ్యాను. నా సమక్షంలోనే అధికారులు సెల్‌ఫోన్‌ పరిశీలించారు. ప్రశాంత్‌ నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదని నిర్ధరించుకున్నారు’’ అని ఈటల తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎక్కడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదు.. అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

పాఠశాలలకు వచ్చే విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్‌ ఉండాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పిల్లలు పాఠశాలలకు రాకుంటే తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్తుందని.. ఇలా ప్రతి విద్యార్థిని ట్రాక్‌ చేస్తున్నామని సీఎం తెలిపారు. అందుకే డ్రాప్‌ అవుట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలని అధికారులకు సీఎం సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గెలిచే సత్తా ఉంటే నన్నెందుకు ప్రాధేయపడ్డారు: పొంగులేటి

పాలేరు ఉపఎన్నిక వేళ ఒత్తిడి తెస్తేనే.. సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు భారాసలో చేరినట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భారాస నుంచి సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను పార్టీ సభ్యుడినే కాదని జిల్లా అధ్యక్షుడు అన్నారని.. అలాంటప్పుడు తనని ఎలా సస్పెండ్‌ చేశారో చెప్పాలని పొంగులేటి డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బిల్లులను ఆమోదించకపోవడం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే: మంత్రి హరీశ్‌రావు

బిల్లులను ఆమోదించకుండా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టడం దారుణమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే కానీ బిల్లులు పాస్‌ కాని పరిస్థితి నెలకొందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్‌ నుంచి మిషన్‌ భగీరథకు నీటి విడుదల ట్రయల్‌ రన్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాహుల్‌ గురించి మూడేళ్ల క్రితం షారుఖ్‌ మాట... ఇప్పుడు వైరల్‌..

ఆదివారం ఐపీఎల్‌లో అదిరిపోయే బ్యాటింగ్‌ ప్రదర్శనలు చూశాం. అందులో హైలైట్‌ అంటే రింకు సింగ్‌ అని చెప్పాలి. అది కాకుండా బాగా గుర్తుండిపోయే ఆట రాహుల్‌ త్రిపాఠి (Rahul Tripathi)ది. పంజాబ్‌పై సూపర్‌ అర్ధశతకం (74*) చేసి టోర్నీలో జట్టుకు తొలి విజయం అందించాడు. దీంతో ఇప్పుడు SRH అభిమానుల ట్విటర్‌ పేజీల్లో ఆ పేరు మారుమోగిపోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గూగుల్‌ పేలో లోపం.. ఖాతాల్లోకి ₹80 వేలు..!

గూగుల్‌కు చెందిన పేమెంట్‌ యాప్‌ గూగుల్‌ పే (Google pay)లో ఒకప్పుడు భారీగా క్యాష్‌బ్యాక్‌లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం చాలా మందికి ‘బెటర్‌ లక్‌ నెక్ట్స్‌టైమ్‌’ అనే సందేశమే వస్తూ ఉంటుంది. అలాంటిది స్క్రాచ్‌ చేసిన వారిలో కొందరికి రూ.80వేల వరకు ఖాతాల్లో జమ అయ్యాయి. గూగుల్‌ పేలో చిన్నపాటి లోపం కారణంగా ఈ విధంగా జరిగింది. అయితే ఇది జరిగింది భారత్‌లో కాదు.. అమెరికాలో! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అరుణాచల్‌ ప్రదేశ్‌కు అమిత్‌షా.. చైనా అభ్యంతరం..!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు ఈశాన్య భారతంలోని కీలక రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించనుండటంపై చైనా అసహనం వ్యక్తం చేసింది. అక్కడ అధికారిక కార్యక్రమాలు చేపట్టడం చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. నేడు అమిత్‌షా ఆ రాష్ట్రంలో చైనా సరిహద్దున ఉన్న కిబితూ గ్రామంలో వైబ్రెంట్‌ విలేజ్ ప్రోగ్రాం(వీవీపీ)ను ప్రారంభించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇవి అసలు రాజకీయ అంశాలేనా?: శరద్‌ పవార్‌

పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు తమ డిగ్రీ పత్రాలను చూపించాలని కొందరు నేతలు ప్రశ్నించడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar) తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. నాయకులు చదువుకున్న కళాశాల ఏది? వారి డిగ్రీ అర్హత ఏంటీ? అనే ప్రశ్నలు ఈ మధ్య తరచుగా వినబడుతున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నా ప్రభుత్వం కూలిపోయి ఉండకపోతే.. రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి అయ్యేది: ఇమ్రాన్ ఖాన్

ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్‌ (Pakistan) కొట్టుమిట్టాడుతున్న వేళ.. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉండుంటే భారత్‌ (India) మాదిరిగా.. పాక్‌ సైతం రష్యా (Russia) నుంచి చౌకధరకే ముడి చమురు దిగుమతి చేసుకునేదని తెలిపారు. కానీ, తన ప్రభుత్వం కూలిపోవడంతో పాక్‌ దిగుమతి చేసుకోలేక పోయిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. స్వీపర్‌ నుంచి స్టార్‌ క్రికెటర్‌గా.. సిక్సర్ల హీరో రింకు!

రింకు సింగ్‌ (Rinku Singh)..  ఇప్పుడంతా ఈ పేరే మార్మోగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌పై 21 బంతుల్లో 48 పరుగులు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) మిడిలార్డర్‌ బ్యాటర్‌.. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి కోల్‌కతాకు (GT vs KKR) చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఐపీఎల్‌ - 16వ సీజన్‌లో కేకేఆర్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనూ బెంగళూరుపై (46) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని