Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Jun 2023 17:36 IST

1. కుప్పంలో వైకాపా గూండాలు రెచ్చిపోతున్నారు: చంద్రబాబు

సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో రెండోరోజు పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక్కడ తెదేపా లక్ష మెజార్టీ సాధించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఈనెల 25న తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 25న నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని భాజపా వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన కూడా త్వరలో ఖరారు అవుతుందని నేతలు చెప్పారు. వాయిదా పడిన భాజపా బహిరంగ సభను ఖమ్మంలోనే నిర్వహించాలని నిర్ణయించామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ ఛుగ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


తెలంగాణ లాసెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


3. ‘జనవాణి’ చేపట్టడానికి ఆ చెల్లెలు ఆవేదనే కారణం: పవన్‌ కల్యాణ్‌

చైతన్యంతో ఉన్న ప్రజలు ప్రజాస్వామ్యంలో పాల్గొనకపోతే.. అరాచకం రాజ్యమేలుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలులో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 34 ఫిర్యాదులు స్వీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘గోదావరి’ సహా 14 రైళ్లు రద్దు.. కారణం ఇదే..

తాడి-అనకాపల్లి మధ్య రాజుపాలెం గేటు వద్ద బొగ్గుతో వెళ్తున్న గూడ్సు రైలు నిన్న పట్టాలు తప్పడంతో అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల వేళల్ని రీషెడ్యూల్‌ చేశారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న ట్రాక్‌ను మరమ్మతులు చేయడంతో విశాఖ దిశగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 300కి.మీ.. 400 కార్లతో..సైరన్లు మోగిస్తూ భాజపా నుంచి కాంగ్రెస్‌కు

300 కి.మీ మేర 400 కార్ల కాన్వాయ్‌తో హడావుడి సృష్టించారు ఓ రాజకీయ నేత. తన బలాన్ని చాటుకుంటూ భాజపాను వదిలి తిరిగి సొంతగూడు కాంగ్రెస్‌కు చేరారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని శివ్‌పురి నుంచి భోపాల్‌ వరకు సైరన్లు మోగించుకుంటూ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధిత దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి


6. నీతీశ్‌ కుమార్‌ను ఢీకొట్టబోయిన బైక్‌.. ఫుట్‌పాత్‌పైకి దూకిన సీఎం

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ భద్రతలో భారీ వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. సీఎం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో.. కొందరు వ్యక్తులు బైక్‌పై ఆయనకు అత్యంత సమీపానికి వచ్చారు. ముఖ్యమంత్రి భద్రతా వలయాన్ని ఛేదించుకుని దాదాపు ఆయనను ఢీకొట్టినంత పనిచేశారు. అప్రమత్తమైన నీతీశ్‌ వెంటనే ఫుట్‌పాత్‌పైకి దూకారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసు తొలగించండి..: నివేదిక సమర్పించిన దిల్లీ పోలీసులు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Sharan Singh)పై దిల్లీ పోలీసులు గురువారం 1,000 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై పోక్సో కేసును తొలగించాలని కోరుతూ పాటియాలా హౌస్ కోర్టుకు 500 పేజీల నివేదికను కూడా సమర్పించారు. మైనర్‌ రెజ్లర్‌ పెట్టిన కేసును ధ్రువీకరించే సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసులు దానిని కొట్టేయాలని కోరుతూ నివేదిక ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పార్లమెంటును తప్పుదోవ పట్టించారు.. బోరిస్‌పై హక్కుల కమిటీ నివేదిక!

బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ (Boris Johnson)ను.. పార్టీగేట్‌ కుంభకోణం (Party Gate Scandal) వెంటాడుతోంది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఆంక్షలను ఉల్లంఘించి, డౌనింగ్‌ స్ట్రీట్‌లో విందులు నిర్వహించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ప్రధానిగా ఉన్న సమయంలో నిర్వహించిన ఈ పార్టీల విషయంలో బోరిస్‌ జాన్సన్‌.. పార్లమెంటు సభ్యులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


ఏపీ ఐసెట్‌ రిజల్ట్స్‌.. చెక్‌ చేసి తెలుసుకోండిలా..


9. అతి సమీపానికి ‘బిపోర్‌ జాయ్‌’.. ఆ చిన్నారి పేరు అదే!

త్యంత భీకరంగా మారిన బిపోర్‌జాయ్‌ తుపాన్‌ తీరానికి అతి సమీపంలోకి వచ్చినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కచ్‌ సమీపంలోని జఖౌ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘డియర్‌ ఫ్రెండ్‌’ అంటూ జిన్‌పింగ్‌కు పుతిన్‌ శుభాకాంక్షలు..!

రష్యా-చైనా మధ్య మైత్రీ బంధం పెంచడంలో జిన్‌పింగ్‌ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. జిన్‌పింగ్‌ 70వ జన్మదినోత్సవం సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ రెండు దేశాల మధ్య ఆ మైత్రీ బంధంతోనే ఇటీవల సహకారం పెరిగిందని వెల్లడించారు. రష్యా-చైనా ప్రజల కోసం ఈ నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని