Vladimir Putin: ‘డియర్‌ ఫ్రెండ్‌’ అంటూ జిన్‌పింగ్‌కు పుతిన్‌ శుభాకాంక్షలు..!

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పుట్టిన రోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రత్యేక సందేశం పంపారు. ఇరు దేశాల బంధాన్ని జిన్‌పింగ్‌ బలోపేతం చేశారని కొనియాడారు. 

Published : 15 Jun 2023 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్: రష్యా-చైనా మధ్య మైత్రీ బంధం పెంచడంలో జిన్‌పింగ్‌ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. జిన్‌పింగ్‌ 70వ జన్మదినోత్సవం సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ రెండు దేశాల మధ్య ఆ మైత్రీ బంధంతోనే ఇటీవల సహకారం పెరిగిందని వెల్లడించారు. రష్యా-చైనా ప్రజల కోసం ఈ నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  ‘‘మీ నాయకత్వం కింద చైనా స్థిరమైన ఆర్థికవృద్ధితో స్పూర్తిమంతమైన విజయాన్ని సాధించింది. ప్రజాసంక్షేమం పెరిగింది. అంతేకాదు.. ప్రపంచంలోనే బీజింగ్‌ పాత్ర బలోపేతమైంది’’ అని పుతిన్‌ వ్యాఖ్యనించారు. 

ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాను దూరం పెట్టాయి. దీంతో మాస్కో-బీజింగ్‌ మధ్య బంధం బలోపేతమైంది. ఈ బంధంలో రష్యాపై  చైనా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు డాలర్‌ వినియోగం రష్యాకు నిలిచిపోవడంతో చైనా కరెన్సీ యువాన్‌ను వినియోగం వైపు మాస్కో మొగ్గింది. దీంతో చైనా యువాన్‌ రష్యాలో వినియోగించే అత్యధిక విదేశీ కరెన్సీగా నిలిచింది. తాజాగా పాకిస్థాన్‌ చమురు కొనుగోళ్ల చెల్లింపులు కూడా యువాన్లలోనే జరిగాయి. బ్యాంక్‌ ఆఫ్ రష్యా వద్ద దాదాపు ఈ ఏడాది ప్రారంభం నాటికి దాదాపు 100 బిలియన్‌ డాలర్ల విలువైన యువాన్ల రిజర్వు ఉంది. టెక్నాలజీకి సంబంధించిన కీలక పరికరాలు చైనా నుంచి రికార్డు స్థాయిలో రష్యాకు ఎగుమతి అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని