Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 28 Feb 2024 09:00 IST

1. అద్దాల భవనం.. పార్కింగ్‌ ఆధునికం

నగరం నడిబొడ్డున నిర్మాణం చేపట్టిన బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. ఐదేళ్లుగా పనులు కొనసాగుతుండగా 15 అంతస్తుల భవనం ఎట్టకేలకు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఎలివేషన్‌ వరకు పూర్తయినా.. లోపల ఆటోమేటిక్‌ పార్కింగ్‌ వ్యవస్థను బిగించాల్సిఉంది. పూర్తి చేసేందుకు సమయం పట్టేలాఉంది. పూర్తి కథనం

2. కట్టబెట్టలే.. కష్టబెట్టుడే!

విజయవాడ తూర్పు పరిధిలో ఎనిమిదో వార్డువాసి నారు రామారావుకు గత ప్రభుత్వం టిడ్కో గృహం కేటాయించింది. భార్య విజయ పేరు మీద లబ్ధిదారు వాటా కింద రూ.50 వేలు కట్టారు. 2021 డిసెంబరు 30న సప్తగిరి గ్రామీణ బ్యాంకు రూ.3.65 లక్షలు రుణం ఇచ్చింది. నాటి నుంచి రెండేళ్లు మారటోరియం ఉంటుంది. తర్వాత నుంచి వాయిదాలు చెల్లించాలి. ఆ ప్రకారం 2023 డిసెంబరు 29తో రెండేళ్ల గడువు ముగిసినా ఇల్లు ఇవ్వనేలేదు. పూర్తి కథనం

3. వచ్చేది జీరో బిల్లు.. ఇంటింటా వెలుగు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ గృహజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రేషన్‌కార్డు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ అందనుంది. ఫిబ్రవరిలో వినియోగించిన విద్యుత్తుకు సంబంధించి మార్చిలో అర్హులైన లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేస్తారు. ఇందుకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఉత్తర విద్యుత్తు పంపిణీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌పీడీసీఎల్‌) అధికారులు రేషన్‌ కార్డు, ఆధార్‌, యూనిక్‌ సర్వీస్‌ నెంబరు (యూఎస్‌నెం), చరవాణి నెంబర్ల సమాచారం సేకరించి అర్హులను గుర్తించారు. పూర్తి కథనం

4. అధికారం హద్దులు దాటేస్తోంది!

వైకాపా నుంచి సమన్వయకర్తలుగా నియమితులైన కొందరు నేతలు ప్రభుత్వ ప్రతినిధుల్లా వ్యవహరిస్తూ దర్జాగా ప్రారంభోత్సవాలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. కీలక శాఖల అధికారులతో సమీక్షలూ నిర్వహించేస్తున్నారు. నియోజకవర్గానికి రాజైనా, మంత్రయినా నేనే.. ఏం జరిగినా నాకు తెలియాలంటూ హుకుం జారీచేస్తున్నారు. వీరి కథ ఇలా ఉంటే.. పూర్తి కథనం

5. కాంగిరేసు గుర్రమెవరో?

ఖమ్మం లోక్‌సభ స్థానంలో పోటీపై కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూఅధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నవారు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీచేసినా అత్యధిక ఆధిక్యంతో గెలిపిస్తామంటున్న నేతలు, ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు బరిలో నిలవకపోతే సీటు తమకే కేటాయించాలంటూ ఎవరికివారు ముమ్మరంగా ప్రయత్నిస్తుండటం గమనార్హం. పూర్తి కథనం

6. సీఎం జగన్‌ సభకు వెళ్లి.. తిరిగి రాని బస్సు

కుప్పంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సభకు జన సమీకరణకు వెళ్లిన ఓ బస్సు మాయమైంది. దీంతో ఆర్టీసీ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. 24 గంటల తర్వాత బస్సు ఆచూకీ లభ్యం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. ఈ నెల 26 కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో సీఎం పాల్గొనే బహిరంగ సభకు జనసమీకరణ కోసం తిరుపతిలోని అలిపిరి డిపోకు చెందిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఈ నెల 25న ఆదివారం సాయంత్రం కుప్పం వెళ్లింది. పూర్తి కథనం

7. అధికారంలో అయోమయం

ఓ వైపు ప్రతిపక్ష తెదేపా ఒకే దఫా జిల్లాలో అయిదుగురి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ‘పంచ్‌’ విసిరింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అంతులేని ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకుంటున్నారు. గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అదే సమయంలో అధికార వైకాపా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పూర్తి కథనం

8. కృత్రిమ మేధ గుండె కాయ

కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. ఛాట్‌జీపీటీ, జెమినీ వంటి ఛాట్‌బాట్లు.. మిడ్‌జర్నీ, డాల్‌-3 వంటి జనరేటివ్‌ ఏఐ టూల్స్‌.. సోరా వంటి వీడియో జనరేటర్లు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. పదాల ఆదేశాలతోనే పనులను చేసి పెడుతూ.. మనం చేయాల్సిన పనులను సులభం చేస్తూ.. చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. పూర్తి కథనం

9. ఇంత బరితెగింపు ఏంటన్నా!

చెప్పుకొనేందుకు చేసిన అభివృద్ధి పనులేమీ లేవు. దీంతో ప్రలోభాలనే నమ్ముకున్నట్లున్నారు అధికార పార్టీ నేతలు. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ సిద్ధమని బీరాలు పలుకుతున్నారు. తాయిలాల పంపిణీకి పోటాపోటీగా బరి తెగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కీలకంగా భావిస్తున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులే లక్ష్యంగా ఈ కథ నడుపుతున్నారు. పూర్తి కథనం

10. ఆఫర్‌ లెటర్‌ అందాక... ఆరు సూత్రాలు!

ఐ.టి., కార్పొరేట్‌ నియామకాల్లో ఇటీవలికాలంలో ఒక ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో ఎంపికై ఆఫర్‌ లెటర్‌ అందుకున్నా అంతిమంగా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఉద్యోగార్థి చేతికి చిక్కడం లేదు. ఆరో సెమిస్టర్‌లోనో, ఏడో సెమిస్టర్‌లోనో ఎంపికై ఆఫర్‌ లెటర్‌ అందుకుంటున్నాం కానీ ఎప్పుడు చేరాలో సమాచారం మాత్రం రావడం లేదని క్యాంపస్‌ వదలిపెట్టిన తర్వాత ఉద్యోగార్థులు బాధపడుతున్నారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని