Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 11 May 2023 20:59 IST

1. పొత్తులు పెట్టుకుంటాం.. వైకాపా దాష్టీకాన్ని ఎదుర్కొంటాం: పవన్‌ కల్యాణ్‌ 

వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పొత్తులతోనే చాలా పార్టీలు బలపడ్డాయన్నారు. వైకాపా అరాచకాలను ఎదుర్కొనేందుకు.. బలమున్న ప్రధాన పార్టీలు కలిసి నడవాలని భావిస్తున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జైలు నుంచి బెయిల్‌పై రేణుక రాథోడ్‌ విడుదల

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఏ3గా ఉన్న రేణుక రాథోడ్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. పూచీకత్తులు సమర్పించడంలో ఆలస్యమైంది. రేణుక తరఫు న్యాయవాదులు గురువారం పూచీకత్తులు సమర్పించడంతో కోర్టు బెయిల్ ఆర్డర్‌ కాపీలను జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చంద్రబాబు కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన వైకాపా వాహనాలు

తెదేపా అధినేత చంద్రబాబు వాహనశ్రేణిలో మరోసారి భద్రతాలోపాలు బయటపడ్డాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు బాసటగా నిలిచేందుకు తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ఈనెల 12న  రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈక్రమంలో గురువారం సాయంత్రం చంద్రబాబు తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో తణుకు బయలుదేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తిరుగుబాటు నుంచి తీర్పు వరకు.. ‘మహా సంక్షోభం’ సాగిందిలా..!

శివసేనలో ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటు కారణంగా గతేడాది మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. చివరకు మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోవడం.. శిందే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిపోయాయి. అయితే, ఆ సమయంలో గవర్నర్‌ వ్యవహరించిన తీరు, తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వంటి అంశాలపై అటు ఉద్ధవ్‌ ఠాక్రే, శిందే వర్గాలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆయనే నాకు మార్గదర్శకుడు.. ఎప్పటికీ రుణపడి ఉంటా: కోహ్లీ

ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ  క్రేజ్‌ అసాధారణం. ఫిట్‌నెస్‌పరంగా అంతర్జాతీయంగా అత్యుత్తమ క్రికెటర్‌ కూడా అతడే. మైదానంలో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ.. బయట మాత్రం తన గురు భక్తిని ప్రదర్శించడానికి ఏమాత్రం మొహమాట పడడు. ఇటీవల దిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా తన చిన్ననాటి కోచ్, మెంటార్‌ రాజ్‌కుమార్‌ శర్మకు పాదాభివందనం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్‌

మన దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు (Same-sex Marriage) చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలపై పలు పిటిషన్లపై సుప్రీం కోర్టులో (Supreme Court) వాదనలు పూర్తయ్యాయి. వీటిపై 10 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఎస్‌ఆర్‌ భట్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉద్ధవ్‌.. మీకు ఆ డైలాగ్‌లు సూట్‌ కావు..!

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నైతికత గురించి మాట్లాడుతున్నారని, అసలు ఆ డైలాగ్ ఆయనకు సరిపోదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు మహావికాస్‌ అఘాడీ(ఎంవీఏ) కుట్రలు ఓడిపోయాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టబద్ధతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది పూర్తిగా చట్టబద్ధమైంది’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అరెస్టు అక్రమం.. ఇమ్రాన్‌ విడుదలకు పాక్‌ సుప్రీంకోర్టు ఆదేశం

మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు అక్కడి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఇమ్రాన్‌ను అవినీతి నిరోధక విభాగం (National Accountability Bureau) చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందన్న సుప్రీంకోర్టు.. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. కోర్టు ప్రాంగణంలో ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదన్న న్యాయస్థానం.. దేశంలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గూగుల్ బార్డ్ వచ్చేసింది.. ఎలా ఉపయోగించాలంటే?

గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) కార్యక్రమంలో సరికొత్త ఆవిష్కరణలను విడుదల చేసింది. ఈ వేదికపైనే ఏఐ టూల్‌ గూగుల్ బార్డ్‌ (Google Bard)ను భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ (OpenAI ChatGPT), మైక్రోసాఫ్ట్ బింగ్‌ చాట్‌ (Microsoft Bing Chat)కు పోటీగా తీసుకొస్తున్న బార్డ్‌ను ఎలా ఉపయోగించాలి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కుమారుడితో సహా 25 జంటలకు సామూహిక వివాహం.. జరిపించిన భాజపా ఎమ్మెల్యే

నిరుపేదలైన 25 జంటలకు ఘనంగా సామూహిక విహహాలు (Mass marriage) జరిపించారు  మహారాష్ట్ర ( Maharashtra)లోని ఔసా ( Ausa) నియోజకవర్గ ఎమ్మెల్యే అభిమన్యు పవార్‌ (Abhimanyu Pawar). ఈ జంటలతో పాటు ఆయన కుమారుడి వివాహం కూడా జరగటం విశేషం. మహారాష్ట్రలోని లాతూర్‌ (Latur) జిల్లాలోని ఉటేజ్‌లో బుధవారం సాయంత్రం వివాహ బంధంతో ఈ జంటలు ఒక్కటయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని