Chandrababu: చంద్రబాబు కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన వైకాపా వాహనాలు

తెదేపా అధినేత నారా చంద్రబాబు వాహనశ్రేణితో మరోసారి భద్రతాలోపాలు బయటపడ్డాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరులో చంద్రబాబు కాన్వాయ్‌లోకి వైకాపా వాహనాలు దూసుకొచ్చాయి.

Updated : 11 May 2023 19:52 IST

ఉంగుటూరు: తెదేపా అధినేత చంద్రబాబు వాహనశ్రేణిలో మరోసారి భద్రతాలోపాలు బయటపడ్డాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు బాసటగా నిలిచేందుకు తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ఈనెల 12న  రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈక్రమంలో గురువారం సాయంత్రం చంద్రబాబు తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో తణుకు బయలుదేరారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు వచ్చే సమయానికి చంద్రబాబు కాన్వాయ్‌లోకి వైకాపా వాహనాలు దూసుకొచ్చాయి.

ఉంగుటూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వరకు చంద్రబాబు కాన్వాయ్‌ను వైకాపాకు చెందిన రెండు వాహనాలు అనుసరించాయి. ఈ వాహనాలను నియంత్రించకుండా ఎస్కార్ట్‌ పోలీసులు వదిలేశారు. పోలీసు ఎస్కార్ట్‌ సిబ్బంది చోద్యం చూశారు తప్ప పట్టించుకోలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడేపల్లి గూడేం నుంచి వైకాపా వాహనాలు కాన్వాయ్‌ నుంచి వేరే మార్గంలో వెళ్లిపోయాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు