Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 18 Jun 2023 21:10 IST

1. నేరగాళ్లకు ఊతమిచ్చేలా సీఎం జగన్‌ వైఖరి: చంద్రబాబు

వైకాపా పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బాపట్ల జిల్లా జిల్లాలో బాలుడి సజీవదహనం సహా పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. సీఎం వైఖరి, ప్రభుత్వ అసమర్థత నేరగాళ్లకు ఊతమిచ్చేలా ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 28 రైళ్లు.. 23 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్‌ ఇదే!

తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాలకు సర్వీసులందించే పలు ప్రయాణికుల రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆయన ముఖ్యమంత్రేనా..? కేజ్రీవాల్‌కు పైలెట్టా..?: అమిత్‌షా

పంజాబ్‌లో శాంతిభద్రతలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా..ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు చీమకుట్టినట్టయినా లేదని అన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘దివాలా తప్పాలంటే పాక్‌ ఆ పని చేయాల్సిందే’

అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో పాకిస్థాన్‌ (Pakistan) నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆ దేశ కేంద్ర బ్యాంకు మాజీ గవర్నర్‌ రెజా బకీర్ అన్నారు. దివాలా ముప్పును తప్పించుకోవాలంటే సంబంధాలను మెరుగుపర్చుకోక తప్పదని స్పష్టం చేశారు. లండన్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీపై ఆరోపణలు.. స్పందించిన కేంద్రమంత్రి

మొబైల్ ఫోన్‌ (Mobile Phone) వినియోగదారుల్లో భారత దేశం (India) ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. కానీ, భారత్‌ మొబైల్‌ మార్కెట్‌లో చైనా కంపెనీలదే అధిక శాతం వాటా. అయితే, ఆ దేశ మొబైల్‌ కంపెనీలు తయారు చేసిన స్మార్ట్‌ఫోన్ల (Smart Phones) ద్వారా భారత్‌ సహా ఇతర దేశాల్లోని యూజర్ల డేటాను చైనా (China) సేకరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రెస్టారంట్‌కి వెళ్లిన ఇద్దరు ప్రపంచ కుబేరులు.. బిల్లు కట్టేదెవరు?

మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సామాజిక మాద్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. ఏదైనా ఆసక్తికర విషయం తన దృష్టికి వస్తే.. సోషల్‌ మీడియాలో పంచుకుంటారు. వాటిలో కొన్ని ఆలోచనలు రేకెత్తించే అంశాలు కూడా ఉంటాయి. తాజాగా ప్రపంచ కుబేరులు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk ), బెర్నాండ్‌ ఆర్నాల్ట్‌ (Bernand Arnault) ఇద్దరూ పారిస్‌లోని ఓ రెస్టారంట్‌కి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గీతాప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారం

జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారాన్ని(Gandhi Peace Prize) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏడాదికి గాను గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత గీతాప్రెస్‌(Gita Press)ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష కృషికి గుర్తింపుగా గీతాప్రెస్‌ ప్రచురణ సంస్థను ఈ  పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌ మాటలను ప్రపంచం శ్రద్ధగా వింటోంది : రాజ్‌నాథ్‌

డిచిన తొమ్మిదేళ్లలో అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ప్రతిష్ఠ ఎంతో పెరిగిందని.. మన దేశం చెప్పిన మాటాలను యావత్‌ ప్రపంచం శద్ధగా వింటోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. యూపీఎస్‌సీ సివిల్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులతో యూపీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన భారత్‌ అనేది ఇప్పటివరకు కలగానే ఉందని, ప్రధాని మోదీ నాయకత్వంలో అప్పుడది సాకారమవుతోందని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. అదుపులో 25 మంది విదేశీయులు

అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో సెంట్రల్‌ డివిజనల్ పోలీసులు బెంగళూరులోని ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్‌, చర్చి వీధుల్లో  శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 25 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా వెల్లడించారు. వీరంతా అనైతిక కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు, మాదకద్రవ్యాల విక్రయ ఏజెంట్లుగానూ పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 12 కిలోల బాహుబలి సమోసా.. తింటే రూ.71 వేల బహుమతి!

చిరుతిళ్లలో సమోసా (Samosa)ది ప్రత్యేక స్థానం. చేతిలో పట్టేంత సమోసాలను మనం చూసి ఉంటాం. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో మాత్రం ఏకంగా 12 కిలోల ‘బాహుబలి సమోసా (Bahubali Samosa)’ను తయారు చేశారు. పైగా దీన్ని అరగంటలో తింటే.. రూ.71 వేల నగదు బహుమతి ఇస్తామని నిర్వాహకులు ఛాలెంజ్‌ విసిరారు. ఇక్కడి మేరఠ్‌లో శుభం కౌశల్‌ అనే వ్యక్తి మిఠాయిల దుకాణం నడుపుతుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని