Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 07 Jun 2024 09:09 IST

1. ఆశల పల్లకి... అందేదెవరికి..?

రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈసారి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రెండు జిల్లాల పరిధిలో 14 శాసనసభ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బాబు సభలు.. గెలుపు వేదికలు

2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను వైకాపా కైవసం చేసుకొంది. ఒక్క చోటా గెలుపొందకపోవడంతో తెదేపా శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘అధికార’ పార్టీ ముప్పుతిప్పలు పెట్టింది.. తెదేపా మద్దతుదారులు నామినేషన్లు వేసేందుకు భీతిల్లే పరిస్థితిని కల్పించింది. కొన్నిచోట్ల వేసినా తిరస్కరించారు. వైకాపా అరాచకాలకు పార్టీ కార్యకర్తలే కాక.. సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అలాంటి తరుణంలో తెదేపా అధినేత చంద్రబాబు అడుగు ముందుకేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైకాపా నేతల వికృత చేష్టలపై చెంపదెబ్బ

ఐదేళ్ల జగన్‌ పాలనలో చేసిన అకృత్యాలు.. దౌర్జన్యాలతో విసిగిపోయిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో వైకాపాను భూస్థాపితం చేశారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, భవనాలకు గతంలో ఉన్న మహనీయుల పేర్లను మార్చేయడంపై ప్రస్తుతం ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. కొత్తగా ఏదైనా నిర్మించి, లేదా సంస్థలను నెలకొల్పి పేర్లను పెట్టుకోవచ్చు. కానీ.. మహనీయుల పేర్లను తొలగించి.. తమకు నచ్చినవాళ్లవి పెట్టుకోవడంపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు, నిరసనలు వెల్లువెత్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్నడూ ఎరుగని.. ఆధిక్యాల మోత..!

సిక్కోలు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. ఎనిమిది నియోజకవర్గాల్లో కూటమి సగటున 20 వేలకుపైగా ఆధిక్యతను కైవసం చేసుకుంది. వైకాపా సీనియర్‌ నాయకులు, మంత్రులను సైతం చిత్తు చేసింది. వ్యతిరేకత, జిల్లా నేతల అరాచకాలు, అవినీతి, అభివృద్ధి లేమి వంటి అంశాలు వైకాపా నేతల ఘోర పరాజయానికి  బాటలు వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇకపై మోదీ తనకు నచ్చినట్లు చేస్తానంటే కుదరదు

ఇండియా కూటమి బలమైన, సమర్థమైన ప్రతిపక్షంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్ నేత శశి థరూర్‌ (Shashi Tharoor) అన్నారు. ఎన్డీయే కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ లభించిందని గుర్తుచేశారు. వారి హక్కును కాలరాసేందుకు తాము ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అరాచకాలపై అక్కాచెల్లెమ్మల వజ్రాయుధం!

అక్కాచెల్లెమ్మల కోసం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెం టీలను ఆదరించారు.. మెగా డీఎస్సీ, పరిశ్రమలను తెచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీలను నమ్మారు.. అరాచకాలపై ఉక్కుపాదం మోపుతామంటే మైమరిచి పోయారు.. గంజాయిని తరిమికొడతామంటే కొండంత భరోసా ఇచ్చినట్లు భావించారు.. దీంతో జిల్లాలోని అన్ని నియోజవర్గాల్లోనూ ప్రజలు కూటమికి జైకొట్టారు. ముఖ్యంగా మహిళలు, యువత కూటమి వైపు మొగ్గుచూపినట్లు ఫలితాలతో తేటతెల్లమైంది. మొత్తంగా జగన్‌ అరాచక ప్రభుత్వాన్ని పాతాళానికి అణగదొక్కారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐఎస్‌ఎస్‌కు చేరిన సునీత, విల్‌మోర్‌

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు గురువారం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) చేరుకున్నారు. వీరిని రోదసిలోకి తీసుకెళ్లిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక గురువారం రాత్రి అంతరిక్ష కేంద్రంతో క్షేమంగా అనుసంధానమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎందుకు ఓడిపోయాం?

భారాస పార్టీకి ఉమ్మడి మెదక్‌ జిల్లా కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం మెదక్, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల ఫలితాలతో కారు జోరుకు బ్రేకులు పడటంతో ఎందుకు ఓడిపోయామనే అంతర్మథనం జరుగుతోంది. రాష్ట్రంలోనే గెలుపొందే సీట్లలో మెదక్‌ స్థానం తప్పక ఉంటుందని భావించారు. అంచనాలు తలకిందులయ్యాయి. భారాస మూడో స్థానంలో నిలిచింది. పట్టు ఉన్న జిల్లాలో ఓటమి చెందటాన్ని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

9. అమ్మా.. నాన్న.. బ్రహ్మారెడ్డి.. 

ఒక ఇంట్లో ఒకరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గొప్పవిషయం.. ఎంతోమంది ఆ కలను సాకారం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఏళ్ల తరబడి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసినా పోటీ చేసే అవకాశం దక్కడం గగనమే. ఒక్కవేళ పోటీ చేసినా కొందరికే విజయం దక్కుతుంది. అయితే పల్నాడులోని మాచర్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన జూలకంటి బ్రహ్మారెడ్డి కుటుంబం ప్రత్యేక గుర్తింపు పొందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పదవీ విరమణ ప్రశాంతంగా సాగాలంటే..

పదవీ విరమణ.. ఎన్నో ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత విశ్రాంతంగా ఉండే సమయం. ఈ కాలంలో ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలం. దీనికోసం ఆర్జిస్తున్న సమయంలోనే కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే అనుకున్న విధంగా మలి జీవితాన్ని కొనసాగించగలం. అందుకోసం ముందునుంచే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్నది చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు