Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Sep 2023 17:04 IST

1. కక్ష గట్టి .. కేసు కట్టి.. దండా నాగేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పల్నాడు జిల్లా అమరావతికి చెందిన వైకాపా మాజీ నేత దండా నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై నాగేంద్ర జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు చేశారు. ఆయన వేసిన పిటిషన్‌ విచారించిన తర్వాత ఇసుక తవ్వకాలు ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు వచ్చిన కొద్ది రోజులకే నాగేంద్రపై ఎస్సీ అట్రాసిటీ  కేసు నమోదైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ర్యాష్‌ డ్రైవింగ్‌.. బస్సు డ్రైవర్‌ను కాలితో తన్నిన ట్రాఫిక్‌ సీఐ!

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌పై జీడిమెట్ల ట్రాఫిక్‌ సీఐ వెంకట్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. శనివారం రాత్రి ఐడీపీఎల్‌ చౌరస్తాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ నియంత్రిస్తున్న సమయంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రధాన రహదారిపై ఆగింది. దీంతో బస్సు డ్రైవర్‌ను కిందకు దిగాల్సిందిగా సీఐ కోరారు. ఆ తర్వాత డ్రైవర్‌ను కాలితో తన్ని, చెంప చెళ్లుమనిపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మాదాపూర్ డ్రగ్స్ కేసు.. ఆ 18 మందిని విచారిస్తాం: నార్కోటిక్ బ్యూరో ఎస్పీ

సంచలనం సృష్టించిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో 18 మందిని విచారిస్తామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డి అన్నారు. ఈ కేసులో వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడినవారు సైతం ఇందులో ఉన్నారని దర్యాప్తులో వెల్లడైందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే ‘జమిలి’: రేవంత్‌

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. జమిలి ఎన్నికలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్రాల హక్కులను హరించడానికే భాజపా జమిలి ఎన్నికల ప్రస్థావన తెస్తోందని విమర్శించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యువకులను వేలాడదీసి చిత్రహింసలు పెట్టిన ఘటన.. నలుగురి అరెస్ట్

మంచిర్యాల జిల్లా మందమర్రిలో మేకలు దొంగతనం చేశారంటూ పశువుల కాపరి తేజతో పాటు దళిత యువకుడు కిరణ్‌ను వేలాడదీసి తీవ్రంగా కొట్టిన కేసులో పోలీసులు ఆదివారం నలుగురిని అరెస్ట్ చేశారు. తమ అక్క కొడుకు కిరణ్ కనిపించడం లేదంటూ అతడి చిన్నమ్మ సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాష్ట్ర రాజకీయాల్లో తుమ్మల మచ్చలేని వ్యక్తి: భట్టి విక్రమార్క

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఆదివారం ఆయన్ను కలిశారు. సుమారు గంటపాటు నేతలిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా భట్టిని తుమ్మల శాలువాతో సత్కరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌కు రష్యా చమురు.. 7 నెలల కనిష్ఠానికి దిగుమతులు

రష్యా నుంచి భారత చమురు దిగుమతులు (Imports of Russian oil) వరుసగా మూడోనెలా తగ్గాయి. ఆగస్టులో ఏడు నెలల కనిష్ఠానికి తగ్గాయి. రోజుకి 1.46 మిలియన్‌ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతక్రితం నెల ఇది 1.91 మిలియన్‌ బ్యారెళ్లుగా నమోదైంది. భారత చమురు శుద్ధి సంస్థలు ఇరాక్‌ నుంచి కూడా చమురు దిగుమతుల (Imports of Crude oil)ను తగ్గించుకున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌లో అవినీతి, మత తత్వానికి చోటుండదు: ప్రధాని మోదీ

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. దేశంలో అవినీతి, కుల-మత తత్వాలకు స్థానం ఉండదని వెల్లడించారు. ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లో దిల్లీలో జీ20 (G20) శిఖరాగ్ర భేటీ జరగనున్న నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఓట్ల కోసం సనాతన ధర్మాన్నే అవహేళన చేస్తారా?: అమిత్‌ షా

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఇండియా’ కూటమి హిందుత్వాన్ని అవహేళన చేస్తోందని, దేశ వారసత్వంపై దాడికి పాల్పడుతోందని విమర్శించారు. ఇండియా కూటమి తరఫునే ఉదయనిధి స్టాలిన్‌ ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జమిలి ఎన్నికలతో సామాన్యులకు ఒనగూరేదేమిటి?: కేజ్రీవాల్‌

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికల (Simultaneous Polls)అంశంపై కేంద్రం జోరుగా పావులు కదుపుతోంది. ఈ విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని సైతం నియమించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదిస్తోన్న ‘ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు’ కాన్సెప్ట్‌ హేతుబద్ధతపై పలువురు నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని