Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jul 2023 09:15 IST

1. ధరలకు రెక్కలు తప్పవా?

ప్రపంచం ఆహార సంక్షోభం దిశగా పయనిస్తోందా? రానున్న రోజుల్లో ఆహారోత్పత్తుల ధరలకు రెక్కలు రాబోతున్నాయా? అంతర్జాతీయంగా ప్రస్తుత పరిణామాలను చూసే అదే ఆందోళన కలుగుతోంది. అసలే   ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యులకు ఇది అశనిపాతమే! యుద్ధాల్లాంటి మానవ పాపాలకు ప్రకృతి ప్రకోపాలు తోడై... సామాన్యులను సంక్షోభం దిశగా నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మెదడు గాయాలకు ఆక్సిజన్‌ చికిత్స

కదలికలను నేర్చుకునే నైపుణ్యాలు మనకు నిత్యజీవితంలో పనులు సాఫీగా సాగడానికి దోహదపడుతుంటాయి. అయితే వార్ధక్యం, అనారోగ్యం కారణంగా ఈ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ఇలాంటివారికి ఆక్సిజన్‌ చికిత్సతో ప్రయోజనం ఉంటుందని బెర్లిన్‌లోని జర్మన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ స్పోర్ట్స్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. మన మెదడుకు బోలెడు ఆక్సిజన్‌ అవసరం. ప్రాణవాయువు తగ్గిన సందర్భాల్లో విషయ పరిజ్ఞాన సామర్థ్యం క్షీణిస్తుంది. ఆక్సిజన్‌ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో అది తిరిగి కోలుకుంటుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రావోయి మా పెళ్లికి..

పర్యాటక ప్రాంతాలకు నెలవైన భాగ్యనగరం.. వెడ్డింగ్‌ టూరిజం వైపు అడుగులు వేస్తోంది. పరిచయం లేని విదేశీ అతిథులకు నగరంలో జరిగే పెళ్లిళ్లకు రావాలంటూ ఆహ్వానాలు పంపుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో తప్పక రావాలంటూ మరీమరీ చెబుతున్నారు. పసందైన భోజనం, వినోదాలు, ఫొటోషూట్‌లతో సందడి చేయాలని కోరుతున్నారు. నగరంలో మొదలైన ఈ పోకడకు నాంది పలికింది ‘జాయిన్‌ మై వెడ్డింగ్‌’ వెబ్‌సైట్‌.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇష్టమైతే కష్టమేం కాదు..!

చిన్నప్పుడే పెళ్లయ్యింది. ఇంట్లో అందరం కూలీకెళ్తేగాని పూటగడవని పరిస్థితి. ఊళ్లో బడి లేదు. చదువుకోమని ప్రోత్సహించేవారు లేరు. అందుబాటులో వసతుల్లేవు.. వంటి ఎన్నో కారణాలతో చాలామంది అక్షరాలు దిద్దకుండానే, ఉన్నతవిద్యకు అందుకోకుండానే ఆగిపోతుంటారు. కానీ, మనసులో చదువుకోవాలి, ఎదగాలన్న దృఢసంకల్పం ఉంటే ఇంతకు పదింతల అవరోధాలను అధిగమించొచ్చు. ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి చేరుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పింఛను అందుతుంటే వాహనమిత్రకు అనర్హులే

వైఎస్సార్‌ పింఛను కానుక కింద కల్లుగీత కార్మికులు, చర్మకారులకిచ్చే సామాజిక భద్రత పింఛనుకు వాహనమిత్ర ఆర్థిక సాయానికి ప్రభుత్వం లంకెపెట్టింది. ఈ పింఛనుదారులు వాహనమిత్ర పథకానికి అనర్హులని పేర్కొంటూ గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారమిచ్చింది. ఈ పథకాన్ని వృత్తి ప్రాతిపదికగా తీసుకుని అమలు చేస్తున్నామని, అందుకే సదరు పింఛనుదారుల్ని అనర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలను కాపు నేస్తానికి అనర్హులుగా పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మంత్రి కాన్వాయ్‌ వస్తుంటే.. లేచి నిలబడాల్సిందే!

రాష్ట్ర మంత్రి జోగి రమేష్‌.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కొత్త సంప్రదాయానికి తెరలేపారు. తాను ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లినా, కాన్వాయ్‌లో ఉన్నా ఆ సమయంలో రహదారికి ఇరువైపులా కూర్చున్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు లేచి నిలబడాల్సిందేనన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. శనివారం బంటుమిల్లి మండలం ముంజులూరు టోల్‌ప్లాజా వద్ద జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి జోగి రమేష్‌ కాన్వాయ్‌..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హామీల ఆర్భాటమే..!

నంద్యాల నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగక పోగా మౌలిక వసతులు సైతం కరవై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పేదలకు ఉచితంగా ఇళ్లను కట్టించి రిజిస్టర్‌ చేసిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. కొందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం మినహా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై దృష్టి నిలపలేదు.  తెదేపా హాయంలో ఎస్సార్బీసీ కాలనీలో 50 ఎకరాల్లో రూ.890 కోట్లతో టిడ్కో గృహాలు, వైఎస్సాఆర్‌.నగర్‌, అయ్యలూరు మెట్ట వద్ద పేదలకు అపార్టుమెంట్ల నిర్మాణాన్ని  చేపట్టినా లబ్ధిదారులకు వాటిని వైకాపా ప్రభుత్వం అప్పగించ లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో మాతృభాషల్లో బోధన

కేంద్రీయ విద్యాలయాలు, ఇతర సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో పూర్వప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు మాతృభాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలకు సర్క్యులర్‌ జారీ చేసింది. బోర్డు పరిధిలోకి వచ్చే అన్ని విద్యాలయాల్లో మాతృభాషను బోధనా మాధ్యమంగా చేసుకొని బహుభాషా విద్యను ప్రోత్సహించాలని అందులో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చినుకుకే ఛిద్రమై.. నడకే నరకమై

ఒక్క ముసురుకే వందలాది కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రైవేటు నిర్వహణకు ఇచ్చిన ప్రధాన రహదారులు సైతం మట్టి రోడ్లను తలపిస్తున్నాయి. ఇక కాలనీ రోడ్లు మరింత దారుణంగా మారాయి. ఓ వైపు నాలాల కోసం జీహెచ్‌ఎంసీ గుంతలు తవ్వి వదిలేయగా, మరోవైపు మురుగునీటి పైపులైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ ఛిద్రమయ్యాయి. డ్రైనేజీ పొంగడంతో సరూర్‌నగర్‌, యూసఫ్‌గూడ, బోరబండ, కృష్ణానగర్‌, గాజులరామారం, కూకట్‌పల్లి, శివారు మున్సిపాలిటీల్లోని రోడ్లు మురికి కుంటలను తలపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కేరళలో దోషికి మరణదండన, 92 ఏళ్ల జైలుశిక్ష.. జరిమానా

ఆరేళ్ల బాలుడిని హత్య చేసి, అతడి సోదరి (14)పై అత్యాచారం జరిపిన కేసులో దోషి సునీల్‌కుమార్‌ (44)కు కేరళలోని ఇడుక్కి స్పెషల్‌ పోక్సో కోర్టు శనివారం మరణదండనతోపాటు ఏకంగా 92 ఏళ్ల జైలుశిక్ష విధించింది. రూ.9.91 లక్షల జరిమానా వేసింది. డబ్బు కట్టకపోతే.. మరో 11 ఏళ్లు అదనంగా శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. విడివిడిగా నాలుగు యావజ్జీవ శిక్షలు, ఇతర సెక్షన్ల కింద కోర్టు వేసిన శిక్షాకాలం కలిపితే 92 ఏళ్లు అవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని