మెదడు గాయాలకు ఆక్సిజన్‌ చికిత్స

కదలికలను నేర్చుకునే నైపుణ్యాలు మనకు నిత్యజీవితంలో పనులు సాఫీగా సాగడానికి దోహదపడుతుంటాయి.

Updated : 23 Jul 2023 06:07 IST

వాషింగ్టన్‌: కదలికలను నేర్చుకునే నైపుణ్యాలు మనకు నిత్యజీవితంలో పనులు సాఫీగా సాగడానికి దోహదపడుతుంటాయి. అయితే వార్ధక్యం, అనారోగ్యం కారణంగా ఈ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ఇలాంటివారికి ఆక్సిజన్‌ చికిత్సతో ప్రయోజనం ఉంటుందని బెర్లిన్‌లోని జర్మన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ స్పోర్ట్స్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. మన మెదడుకు బోలెడు ఆక్సిజన్‌ అవసరం. ప్రాణవాయువు తగ్గిన సందర్భాల్లో విషయ పరిజ్ఞాన సామర్థ్యం క్షీణిస్తుంది. ఆక్సిజన్‌ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో అది తిరిగి కోలుకుంటుంది. వందశాతం ప్రాణవాయువు బట్వాడా ద్వారా.. నాడీ సంబంధ గాయాలైనవారిలో చాలావరకూ మెదడు పనితీరును పునరుద్ధరించే విధానం ఇప్పటికే అమల్లో ఉంది. అలాగే కదలికలను నేర్చుకునే ‘మోటార్‌ అభ్యసనం’ కూడా ఆక్సిజన్‌ ఆధారిత సమాచార ప్రాసెసింగ్‌, జ్ఞాపకశక్తి విధులతో ముడిపడి ఉంటోంది. గత వైఫల్యాలను సరిదిద్దుకునే విధానం ద్వారా మానవులు నేర్చుకుంటారు. అందువల్ల మోటార్‌ అభ్యసనం విషయంలోనూ మునుపటి అనుభవాలకు సంబంధించిన సమాచారాన్ని గుర్తుంచుకోవడం, దాన్ని అనుసంధానం చేసుకోవడం చాలా కీలకం. అందువల్ల కదలికలకు సంబంధించిన ఒక అంశాన్ని నేర్చుకునే క్రమంలో అదనంగా ఆక్సిజన్‌ అందించడం వల్ల ఆ అభ్యాస ప్రక్రియపై వేగంగా, మరింత సమర్థంగా పట్టు సాధించొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని