Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Aug 2023 09:21 IST

1. ట్రక్కు డ్రైవర్‌గా కోటి సంపాదిస్తోంది..!

పెద్ద పెద్ద కార్లు సైతం అవలీలగా నడిపేసినా;  లారీలు, ట్రక్కులు మొదలైన భారీ వాహనాలను నడిపే విషయంలో మాత్రం మహిళలు కొంచెం తక్కువగానే కనిపిస్తారు. ఆ మాటకొస్తే- భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు వచ్చే వేతనాలు కూడా తక్కువే. అయితే ఆస్ట్రేలియాకు చెందిన యాష్లియా మాత్రం ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తూ ఏడాదికి దాదాపు కోటి రూపాయలు సంపాదిస్తోంది. అంతేకాదు.. ఏడాదికి ఆరు నెలలు మాత్రమే పని చేస్తూ మిగతా సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాలను చుట్టేస్తోంది. అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వామ్మో టమాటా దొంగలు

బంగారం, ఇతర విలువైన వస్తువులను చోరీ ఘటనలు మనం చూశాం. ఇపుడు దొంగలు రూటు మార్చారు. రెండు నెలలుగా టమాటా ధరలు అధికంగా ఉండటంతో దుండగుల చూపు వాటి వైపు పడింది. ఏకంగా టమాటా తోటల్లోకి చొరబడి పంటను ఎత్తుకెళ్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంట దొంగలపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పనులు నిలిచిపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు...

మంత్రి బొత్స మాట్లాడుతూ ‘వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశముంది. డిసెంబర్‌నాటికి అన్నిశాఖల పరిధిలో పనులు పూర్తవ్వాలి. నిలిచిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నెలాఖరులోగా సచివాలయాలు, ఆర్బీకేల పనులు పూర్తి చేయాలి’ అని పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. రహదారులు, వంతెన పనులకు సంబంధించి వారం రోజుల్లో ప్రతిపాదనలు పంపిస్తే నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బైజూస్‌.. ఆదిలోనే తుస్‌..!

 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యాబోధనలో గత మూడు ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా గతేడాది డిజిటల్‌ విద్య పేరుతో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు అందజేశారు. తరగతి గదిలో బోధన వినడంతో పాటు ట్యాబ్‌లో పాఠాలను చూడడం ద్వారా పిల్లలు విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుందని సర్కారు పెద్దలు చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పెద్దిరెడ్డి సోదరులిద్దరూ రాక్షసులు!

మంత్రి పెద్దిరెడ్డి సోదరులు రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రాయలసీమ సాగునీట ప్రాజెక్టులు సందర్శనలో భాగంగా శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా పర్యటన ముగించుకుని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎక్కడైనా టీకా తీసుకోవచ్చు!

గర్భిణులు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకా ఇప్పించాలంటే ఇప్పటివరకు కార్డు పట్టుకొని దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి టీకా వేయాల్సిన రోజు మరిచిపోతే ఇక అంతే. ఇకపై ఆ బాధలేకుండా టీకా వేయాల్సిన రోజు తప్పిపోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యాధి నిరోధక టీకా పంపిణీని డిజిటలైజేషన్‌ చేస్తోంది. ఇందుకోసం యూనివర్సిల్‌ ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రాం యు-విన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ విధానంలో టీకా ఏరోజు తీసుకోవాలో ముందే సంక్షిప్త సమాచారం వస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పుంగనూరులో పోలీసుల వీరంగం

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ శివారు భీమగానిపల్లి బైపాస్‌ కూడలి శుక్రవారం సాయంత్రం రణరంగంగా మారింది. పుంగనూరు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను తెదేపా అడ్డుకుందని ఆరోపిస్తూ శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వైకాపా శ్రేణుల నిరసన ర్యాలీ నిర్వహణకు అనుమతించిన పోలీసులు సాయంత్రం చంద్రబాబు రోడ్‌ షోకు మాత్రం ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్వాయ్‌ పట్టణంలోకి రాకూడదని హెచ్చరిస్తూ భీమగానిపల్లి కూడలిలో భారీగా బలగాలను మోహరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విజృంభిస్తున్న ‘పేగు పూత వ్యాధి’

ఒకప్పుడు అమెరికా, యూరప్‌ దేశాలకు పరిమితమైన పేగు పూత వ్యాధి (ఇన్‌ఫ్లెమేటరీ బౌల్‌ డీసీజ్‌-ఐబీడీ) మన దేశంలోనూ విజృంభిస్తున్నట్లు తాజాగా తేలింది. 2006లో 0.1 శాతం ఉన్న కేసులు ప్రస్తుతం 5.4 శాతానికి పెరిగినట్లు హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) వైద్యుల అధ్యయనంలో తేలింది. ఈ వివరాలు తాజాగా ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌-ఆగ్నేయాసియాలో ప్రచురితమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు సాగిందిలా..

‘మోదీ ఇంటి పేరు’ కేసులో రాహుల్‌ గాంధీకి విధించిన శిక్షను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులివ్వడం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. రద్దైన రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునేందుకు, పార్లమెంటు సమావేశాలకు ఆయన హాజరయ్యేందుకు ఇది మార్గం సుగమం చేసింది. రాజకీయ ప్రాధాన్యమున్న ఈ కేసు పరిణామాలను ఓసారి పరిశీలిస్తే....పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆటలో.. గన్‌డర గండడు!

రోజూ నలభై కిలోమీటర్లు వెళ్లి సాధన చేశాడు... కన్నతండ్రి ఆశయమే లక్ష్యంగా ముందుకెళ్లాడు... ఆట కోసం సరదాల్నీ వదిలేశాడు... ఆ శ్రమ ఊరికే పోలేదు! ఇరవై ఏళ్లకే జాతీయ స్థాయి పతకాలు కొల్లగొట్టాడు... తాజాగా ప్రపంచ జూనియర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో పతకం గెలిచాడు... తనే విజయవాడ కుర్రాడు ఉమా మహేశ్‌.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని