Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 10 Aug 2023 09:02 IST

1. జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్‌-3

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక జాబిల్లి ఉపరితలానికి మరింత దగ్గరగా వెళ్లింది. బుధవారం తాము చేపట్టిన కీలక విన్యాసంతో చంద్రయాన్‌-3 కక్ష్య.. 174 కి.మీ. × 1437 కి.మీ.కి తగ్గిందని ఇస్రో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఈ నెల 14న తదుపరి విన్యాసం చేపట్టనున్నట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాయలసీమకు నీటి కటకట

రాయలసీమ ప్రయోజనాలు కాపాడతామని..అక్కడి రైతుల శ్రేయస్సే తమకు ముఖ్యమని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి జగన్‌  ఆగస్టు రెండోవారం వచ్చినా ఆయకట్టుకు నీటిని విడుదల చేయించలేకపోయారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 863 అడుగుల నీటిమట్టం వద్ద 118.054 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఎగువన జలాశయాలు దాదాపుగా నిండటానికి సమీపంలో ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అక్కరకు రాని ఆసుపత్రులు

ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎంప్యానల్‌ అయిన 1,421 ఆసుపత్రుల్లో 524 ఆసుపత్రులు ఎలాంటి సేవలూ అందించడం లేదని కాగ్‌ పేర్కొంది. వాటి నుంచి ఒక్క క్లెయిమ్‌ కూడా రాలేదని తెలిపింది. మరో 81 ఆసుపత్రుల నుంచి 5 వరకు మాత్రమే క్లెయిమ్‌లు వచ్చినట్లు వెల్లడించింది. దీన్ని బట్టి ఇక్కడ ఎంప్యానల్డ్‌ ఆసుపత్రులు పూర్తిస్థాయిలో పనిచేయడంలేదని తెలుస్తున్నట్లు కాగ్‌ అభిప్రాయపడింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎల్‌ అండ్‌ టీకే విమానాశ్రయ మెట్రో!

విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు టెండర్‌ ఎల్‌ అండ్‌ టీ సంస్థకే ఖరారైనట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండో దశకు గ్లోబల్‌ టెండర్లు పిలవగా.. రెండు బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. ఎల్‌ అండ్‌ టీ లిమిటెడ్‌, ఎన్‌సీసీ లిమిటెడ్‌ మాత్రమే పోటీపడ్డాయి. మెట్రో నిబంధనల్లో తొలిసారిగా పొందుపర్చిన ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ)లో అనుభవం, అర్హత ఉన్న ఎల్‌ అండ్‌ టీకే టెండర్‌ ఖరారైనట్లు ఒక అధికారి తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గృహలక్ష్మికి దరఖాస్తుల వెల్లువ!

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల్లో వివిధ స్థాయుల్లో దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా సాగుతోంది. సొంత స్థలం ఉండి, ఇప్పటివరకు ఆర్‌సీసీ స్లాబ్‌ ఇల్లు లేని పేదలు ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న సంగతి తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమ్మాయిని కనీసం డిగ్రీ చదివిద్దాం!

తమ అమ్మాయి ఉన్నత విద్య అభ్యసించాలని ఊర్లలోనూ అత్యధిక శాతం తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. ఆడపిల్లల్ని కనీసం గ్రాడ్యుయేషన్‌ చదివించాలని గ్రామీణ భారత్‌లో కనీసం 78% తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లు నిర్ధారించింది. 20 రాష్ట్రాల్లో 6,629 గ్రామీణ కుటుంబాలపై ట్రాన్స్‌ఫార్మింగ్‌ రూరల్‌ ఇండియా ఫౌండేషన్‌ (టీఆర్‌ఎఫ్‌ఐ) నిర్వహించిన సర్వే నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విడుదల చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాము కాటేసిన బాలికను బతికిస్తానని పేడ కప్పి..

ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ మంత్ర, తంత్రాల వైద్యాలపై జనం నమ్మకాలు తగ్గట్లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌ జిల్లా థానాకాంట్‌ సమీప గ్రామంలో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. మంగళ్‌సింగ్‌ కుటుంబం ఆదివారం రాత్రి తమ గుడిసెలో నిద్రపోతుండగా.. ఆరేళ్ల కుమార్తెను పాటు కాటేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హిమాలయాలకు పయనమైన రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హిమాలయ యాత్రకు బయలుదేరారు. నెల్సన్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌’ గురువారం తెరపైకి రానుంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ తదితరులు నటించారు. సాధారణంగా తన చిత్రం విడుదలయ్యే సమయంలో రజనీకాంత్‌ హిమాలయాలకు వెళ్లడం పరిపాటి. ఇందులో భాగంగా ఆయన బుధవారం హిమాలయాలకు పయనమై వెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మా రాష్ట్రం పేరును కేరళం అని మార్చండి

తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కేరళ శాసనసభ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని బుధవారం పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించింది. కొత్త పేరును అధికారికంగా మార్పుచేయాలని కోరుతూ ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సభలో ప్రవేశపెట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జైల్లో ఉండలేను.. ఇక్కడి నుంచి తీసుకెళ్లండి

తోషాఖానా కేసులో దోషిగా నిరూపితమై అటక్‌ జైలులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌.. కారాగారంలోని వసతులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడో తరగతి ఖైదీలను ఉంచే గదిలో తనను ఉంచారని, పురుగులు ఇబ్బంది పెడుతున్నాయని తనను కలవడానికి వచ్చిన న్యాయవాది నయీమ్‌ హైదర్‌కు ఇమ్రాన్‌ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని