Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Aug 2023 09:19 IST

1. నాడూ.. నేడూ అలాగే!

బడి భవనాలు భయపెడుతున్నాయి. పలు పాఠశాలల్లో పైకప్పులు పెచ్చులూడి పడుతున్నాయి. మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. బడికి వెళ్లడానికి విద్యార్థులు భయపడుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. నాడు-నేడు శిథిలావస్థకు చేరుకున్న వాటికి వర్తించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్నిచోట్ల పరాయి పంచన విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చక్కర్లు కొడుతోంది..చేటు తెస్తోంది

కోనసీమ జిల్లా పేరు మార్పు సమయంలో జరిగిన అల్లర్ల ఘటనలో కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలను వాట్సాప్‌లలో పంపించారు. ఓ వ్యక్తి ఏకంగా ‘లాకప్‌డెత్‌ జరిగిందని.. ఫలానా ప్రాంతంలో అంతా గుమిగూడి వస్తున్నారని.. ఏదో జరిగే అవకాశం ఉందనే సందేశాన్ని బయటకు పంపారు.. ఈ మెసేజ్‌ వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి పోలీసు ప్రతిష్ఠకు భంగం కలిగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైకాపా నేతలకే ‘యంత్రసేవ’!

ప్రభుత్వ రాయితీతో ఏర్పాటు చేసిన అద్దె యంత్ర కేంద్రాలను వైఎస్‌ఆర్‌ కార్యకర్తలు, నేతలకు కట్టబెట్టడాన్ని సీఎం జగన్‌ దృష్టిలో గ్రామ స్వరాజ్యం అంటారా? వాటిని రైతులకు అద్దెకు ఇవ్వకుండా, అక్కడ ట్రాక్టర్లు ఉన్నాయనే సంగతే రైతులకు తెలియనీయకుండా.. సొంతానికే వినియోగించు కోవడం, అక్రమంగా మట్టి, ఇసుక రవాణాకు వాడుకోవడాన్ని ఏమంటారు సీఎం గారూ?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 2.2 కి.మీ.పొడవైన రైల్‌ ఓవర్‌ రైల్‌ వంతెన సిద్ధం

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత పొడవైన రైల్‌ ఓవర్‌ రైల్‌(ఆర్‌ఓఆర్‌) వంతెన అందుబాటులోకి వచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు-మనుబోలు స్టేషన్ల మధ్య మూడో లైన్‌ పనుల్లో భాగంగా 2.2 కి.మీ. మేర ఈ రైల్‌ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఇప్పటి వరకు 40 మీటర్ల ఆర్‌ఓఆర్‌ పొడవైనది రికార్డుల్లో ఉండగా.. కొత్త వంతెన దాన్ని అధిగమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇక అన్ని గ్రూపులకూ బీఎస్‌, ఎంఎస్‌!

ఎంచుకున్న సబ్జెక్టులను బట్టి ప్రస్తుతం డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ అని.. పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ అని పిలుస్తుండగా.. ఇకముందు అవి బీఎస్‌, ఎంఎస్‌గా మారనున్నాయి. ఇప్పటివరకు ఈ తరహా పేర్లు అమెరికా తదితర  దేశాల్లో ఉన్నాయి. సబ్జెక్టు ఏదైనా బీఎస్‌, ఎంఎస్‌ అనే పిలుస్తారు. భారత్‌లోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సుతో పాటు పీజీ కోర్సుకు ఆ పేర్లే అమలు చేయాలని యూజీసీ నియమించిన నిపుణుల కమిటీ ఇటీవల సిఫారసు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నలుగురూ నడవని దారిలో..!

6. మధురైలో ఘోర రైలు ప్రమాదం.. 9 మంది మృతి

తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లఖ్‌నవూ నుంచి రామేశ్వరం వెళ్తున్న ప్రత్యేక రైలులో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రైలు బోగీ పూర్తిగా దగ్ధమవ్వగా.. 9 మంది మృత్యువాతపడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో రైలులో 63 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చంద్రయాన్‌ - 3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు: ప్రధాని మోదీ

చంద్రయాన్‌ - 3 ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు.. విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నేరుగా బెంగళూరుకు వచ్చారు. విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులకు మోదీ అభివాదం చేశారు. అక్కడి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి వెళ్లి.. శాస్త్రవేత్తలను అభినందించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బాడ్మింటన్‌ ఆడుతున్న లాలూకు బెయిల్‌ ఎందుకు?

దాణా కుంభకోణం కేసులో వైద్య కారణాలతో బెయిల్‌ పొందిన బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బాడ్మింటన్‌ ఆడుతున్నారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. బాడ్మింటన్‌ ఆడగలుగుతున్న వ్యక్తికి బెయిల్‌ ఎందుకని ప్రశ్నించింది. ఝార్ఖండ్‌ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని నివేదించింది. 1996లో వెలుగుచూసిన రూ.950 కోట్ల దాణా కుంభకోణానికి సంబంధించి లాలూపై ఐదు కేసులు నమోదవగా..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ధిక్కారమున్‌ పుతిన్‌ సైతునా!

‘‘వాస్తవమేంటో తెలియదు. కానీ ఆశ్చర్యపడలేదు. పుతిన్‌ హస్తం లేకుండా రష్యాలో ఏమీ జరగదు’’- వాగ్నర్‌ కిరాయి సేన అధినేత యెవెగనీ ప్రిగోజిన్‌ మృతిపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ చేసిన వ్యాఖ్యలివి. ఒక్క బైడెనే కాదు.. చాలా దేశాల నిఘా వర్గాలు కూడా హత్య వెనుక రష్యా అధ్యక్షుడి హస్తం ఉందనే నమ్ముతున్నాయి. ఎందుకంటే రెండు నెలల క్రితం ప్రిగోజిన్‌.. పుతిన్‌ అధికారాన్నే సవాల్‌ చేస్తూ తన కిరాయి సేనలతో మాస్కోను ముట్టడించే ప్రయత్నం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రపంచకప్‌ టికెట్లు ఇలా పెట్టారో లేదో..

ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆలస్యంగా ప్రకటించింది. దీనికి తోడు టికెట్ల విక్రయాన్ని కూడా ఆలస్యంగానే మొదలెట్టారు. ఎప్పుడెప్పుడు టికెట్లు అందుబాటులోకి వస్తాయా? అని ఎదురు చూసిన అభిమానులు.. ఒక్కసారిగా ప్రయత్నించడంతో ఇబ్బందులు తప్పలేదు. ప్రపంచకప్‌ టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయం శుక్రవారం మొదలైంది. తొలి రోజు వార్మప్‌లతో సహా భారతేతర మ్యాచ్‌లకు టికెట్లను విక్రయించారు. రాత్రి 8 గంటలకు అమ్మకం మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని