ICC World Cup 2023 Tickets: ప్రపంచకప్‌ టికెట్లు ఇలా పెట్టారో లేదో..

ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆలస్యంగా ప్రకటించింది. దీనికి తోడు టికెట్ల విక్రయాన్ని కూడా ఆలస్యంగానే మొదలెట్టారు.

Updated : 26 Aug 2023 06:50 IST

దిల్లీ: ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆలస్యంగా ప్రకటించింది. దీనికి తోడు టికెట్ల విక్రయాన్ని కూడా ఆలస్యంగానే మొదలెట్టారు. ఎప్పుడెప్పుడు టికెట్లు అందుబాటులోకి వస్తాయా? అని ఎదురు చూసిన అభిమానులు.. ఒక్కసారిగా ప్రయత్నించడంతో ఇబ్బందులు తప్పలేదు. ప్రపంచకప్‌ టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయం శుక్రవారం మొదలైంది. తొలి రోజు వార్మప్‌లతో సహా భారతేతర మ్యాచ్‌లకు టికెట్లను విక్రయించారు. రాత్రి 8 గంటలకు అమ్మకం మొదలైంది. కానీ టికెట్లకు అభిమానుల నుంచి తీవ్రమైన డిమాండ్‌ ఉండటంతో ‘బుక్‌ మై షో’ యాప్‌, వెబ్‌సైట్‌ ఒక్కసారిగా క్రాష్‌ అయింది. దాదాపు 35 నుంచి 40 నిమిషాల పాటు ఇవి పనిచేయలేదు. దీంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచకప్‌లో భారత్‌ ఆడేవి కాకుండా మిగతా మ్యాచ్‌ల టికెట్ల విక్రయం 8 గంటలకు మొదలైంది. కానీ ఇప్పుడు 8:08. బుక్‌ మై షో యాప్‌ క్రాష్‌ అయింది. మరి టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు అమ్మేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో’’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. ఈ నెల 30 నుంచి భారత్‌ ఆడే మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్‌, పాక్‌ (అహ్మదాబాద్‌లో) పోరు టికెట్ల విక్రయం సెప్టెంబర్‌ 3న జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని