Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Aug 2023 09:20 IST

1. ఎటూ తేల్చని పీఈసీ!

అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించిన ‘ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ’ (పీఈసీ) సమావేశం ఏమీ తేల్చకుండానే ముగిసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో మూడు గంటలకు పైగా జరిగిన పీఈసీ సమావేశంలో వాడీవేడిగా చర్చలు జరిగాయి. కానీ అభ్యర్థుల ఎంపికపై కమిటీ ఒక నిర్ణయానికి రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  నేనెవరో తెలుసా! మంత్రికి ఫోన్‌ చేయమంటావా!

అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జేబులు నింపుకొనేందుకు ఆరాట పడుతున్నారు. ఇష్టారీతిన అక్రమాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వ భూములు, వాగులు వంకలను స్వాహా చేస్తున్నారు. కొండలను కరిగిస్తూ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. అధికారమే పెట్టుబడిగా చెలరేగిపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వర్షం పడితే.. నగరం మునకే

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద కాలువలు ప్రమాదకరంగా నోళ్లు తెరుచుకొని ఉన్నాయి. వాటిపై స్లాబులు గానీ, గ్రిల్స్‌, పలకలు ఏర్పాటు చేయడం లేదు. కల్వర్టులున్న చోటా ఇదే దుస్థితి. నగరపాలక సంస్థ కార్యాలయ కూడలిలోనూ ఇదే పరిస్థితి. ఇది మార్కెట్‌ ప్రాంతం కావడంతో నిత్యం రద్దీ ఉంటుంది. ఇక్కడ 157 దుకాణాలతో పెద్ద సముదాయం ఉంది. వర్షం పడితే ఆ ప్రాంతమంతా మునిగిపోతోంది. దీంతో కొన్ని దుకాణాల వారు హెచ్చరిక బోర్డులు సైతం పెడుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్‌ఫ్యూయల్‌ కారు..

దేశంలో ఇథనాల్‌కు గిరాకీ పెరుగుతుందని, ఈ పరిణామం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో మార్పునకు దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. తద్వారా మన రైతులు కేవలం ‘అన్నదాత’గానే కాదు ‘ఇంధనదాత’గానూ అవుతారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి బీఎస్‌-6 (స్టేజ్‌ 2) ఎలక్ట్రిఫైడ్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఆధారిత కారును మంగళవారం ఆయన ఆవిష్కరించారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడాన్ని ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ సాంకేతికతగా వ్యవహరిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆపదని తెలుసు.. ఆపదే మనసు!

పర్యావరణానికి హానికరంగా మారిన ప్లాస్టిక్‌ కవర్లు, ఒకసారి వాడి పడేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ను గతేడాది నుంచే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వాలూ అమలుచేయాలని ఆదేశించింది. ప్రచార ఆర్భాటమే గానీ, నిషేధం ఊసే లేదు. చిన్న దుకాణాల నుంచి షాపింగ్‌మాల్స్‌ వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ సంచులు యథేచ్ఛగా వాడేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. థర్మాకోల్‌ పలకపై నది దాటితేనే బడికి..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా బివాధనోరా గ్రామ విద్యార్థులు తమ బంగారు భవిత కోసం రోజూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రాష్ట్రంలోని పెద్ద ఆనకట్టల్లో ఒకటైన జాయక్‌వాడీ డ్యామ్‌కు సమీపంలో ఈ గ్రామం ఉంటుంది. డ్యాం వెనుక జలాలకు తోడు రెండు నదులు గ్రామాన్ని చుట్టుముట్టి ఉంటాయి. వంతెన నిర్మాణం డిమాండు ఎప్పటినుంచో పెండింగులో ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇచ్చేది తక్కువ.. కొర్రీలే ఎక్కువ

రెండేళ్ల కిందట సామాజిక పింఛన్లను ప్రతినెలా అర్హులకు మంజూరు చేసేవారు. ఆ తర్వాత ఆరు నెలలకు ఒకసారి మంజూరు చేశారు. ఈ ఏడాది 8 నెలల తర్వాత కొత్త పింఛన్ల మంజూరుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏటా జనవరి, జులై మాసానికి ఇవ్వాల్సి ఉన్నా.. ఈ సారి జాప్యం చోటు చేసుకుంది. దాంతో దరఖాస్తు చేసుకుని ఆశగా ఎదురు చూస్తున్న పండుటాకులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఈసారైనా పింఛను దక్కేనా అన్న ఆందోళనలో ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చీకటి వెబ్‌కు గూగుల్‌ చెక్‌

ఏ సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌ చేసేస్తాం. కొత్త చిరునామా వెతకాలన్నా, క్లిష్టమైన పదానికి సమాధానం తెలుసుకోవాలన్నా, సైన్స్‌ దగ్గర్నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకూ ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా ముందుగా తట్టేది గూగులమ్మ తలుపునే. దీన్ని ఇతరుల చేతిలో మోసపోకుండా ఉండటానికీ ఉపయోగించుకోవచ్చని తెలుసా? చీకటి అంతర్జాలంలో.. అదే డార్క్‌ వెబ్‌లో మన వ్యక్తిగత సమాచారాన్నీ గూగుల్‌ శోధిస్తుంది. దాని గురించి అప్రమత్తమూ చేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తలా తోకా లేని టోఫెల్‌

ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా..టోఫెల్‌ కంటెంట్‌ లేకుండా వారు ఎలా బోధిస్తారు? పూర్తి స్థాయిలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేయకుండా విద్యార్థులు ఎలా సన్నద్ధమవుతారు? ఇవేమీ పట్టించుకోకుండా సీఎం జగన్‌ టోఫెల్‌ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు తమ సొంత సెల్‌ఫోన్లలో ఆడియోలను వినిపిస్తుంటే..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అలసట రాకుండా.. శక్తి కోసం..!

ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు.. వూపిరి సలపని పనులు.. క్షణం తీరికుండదు.. ఒత్తిడి, అలసట.. ఈ విధంగా అలసట రాకుండా ఉండాలంటే శరీరంలో తగినంత శక్తి ఉండాలి. మరి ఆ శక్తి రావాలంటే ఏం చేయాలి? ప్రొటీన్లు మెండుగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర కండర వ్యవస్థ దృఢమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని