Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Jul 2023 13:22 IST

1. కోనసీమ జిల్లాలో బోరు బావి నుంచి అగ్నికీలలు

కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్‌, అగ్నికీలలు ఎగసిపడటం కలకలం రేపింది. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం నుంచి ఈ అగ్నికీలలు, గ్యాస్‌ ఎగసిపడుతుండటంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శామీర్‌పేటలో మాజీ భార్యతో గొడవ.. ప్రియుడి కాల్పులు

శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సిద్ధార్థదాస్‌, స్మిత 2019లో విడిపోయాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత శామీర్‌పేట్‌లోని విల్లా నంబరు 21లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన మనోజ్‌కుమార్‌తో సహజీవనం చేస్తోంది. ఈ రోజు సిద్ధార్ధ తన పిల్లలను చూసేందుకు విల్లా వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో స్మితతో గొడవపడ్డాడు. దీంతో అక్కడే ఉన్న మనోజ్‌ కుమార్‌ ఆగ్రహానికి గురై ఎయిర్‌గన్‌తో సిద్ధార్థపై కాల్పులు జరిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో విచ్చలవిడిగా గంజాయి.. గవర్నర్‌కు లోకేశ్‌ ఫిర్యాదు

రాష్ట్రంలో విచ్చలవిడి గంజాయి లభ్యతపై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను లోకేశ్‌ ఇవాళ కలిశారు. డ్రగ్స్‌ సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెబుతున్న డీఆర్‌ఐ నివేదికను ఆధారాలుగా అందజేశారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆ మూలాలు ఏపీకి ముడిపడి ఉన్నాయని.. ఈ మేరకు డ్రగ్స్‌ కేంద్రంగా రాష్ట్రం మారుతోందంటూ వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.  అధ్యక్ష భవనానికి తెగిన వేలు.. ఫ్రాన్స్‌లో కలకలం

ఫ్రాన్స్‌ అధ్యక్ష భవనానికి వచ్చిన ఓ ప్యాకేజీలో తెగిన వేలు కనిపించడం కలకలం రేపింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫ్రాన్స్‌లో ఇటీవల పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడిపై బెదిరింపులకు పాల్పడుతూ ఈ ప్యాకేజీని పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యమునమ్మ కనికరించినా.. ఇంకా వరద ముప్పులోనే దిల్లీ

దేశ రాజధాని నగరం దిల్లీ(Delhi) కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోన్న యమునా నది(Yamuna River) నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుండటమే అందుకు కారణం. అయితే నగర వాసులు మాత్రం పూర్తిగా జలదిగ్బంధం నుంచి బయటపడలేదు. ఐటీఓ, శాంతి వాన్ ఏరియా, ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీస్ సమీపంలో, ఇంకా పలు కీలక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచే ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వరద కల్లోలం.. హిమాచల్‌కు మరో రూ.180కోట్ల సాయం

వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌ ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక సాయం అందించింది. రాష్ట్రం వరద ప్రభావం నుంచి కోలుకోవడానికి రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆమోదం తెలిపారు. రూ.180.40 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (SDRF)కి కేటాయించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వాగ్నర్ బాస్‌ గురించి బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్‌(Prigozhin) భవితవ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) తనదైన శైలిలో స్పందించారు. ఆయనపై విషప్రయోగం జరగొచ్చేమోనంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రిగోజిన్‌(Prigozhin) చేసిన తిరుగుబాటు, ఆ తర్వాత పరిణామాలను ఉద్దేశించి బైడెన్ ఈ విధంగా స్పందించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విద్యార్థినిని తాకింది 10 సెకన్లేనంటూ.. నిర్దోషిగా తేల్చి..!

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ఇటలీ (Italy)లోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు అందర్నీ నివ్వెరపర్చింది. ఈ కేసులో నిందితుడు కేవలం 10 సెకన్ల కంటే తక్కువ సమయమే ఆ విద్యార్థిని తాకడని (Groping) పేర్కొంటూ అతడిని నిర్దోషిగా తేల్చింది. దీంతో ఈ తీర్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విమానంలో విరాళాలు అడిగి.. పాక్‌ వ్యక్తి వీడియో వైరల్‌

సాధారణంగా రోడ్లపై వెళ్తున్నప్పుడో లేదా బస్సెక్కినప్పుడు కొంతమంది వచ్చి విరాళాలు అడగడం చూస్తుంటాం. కానీ విమానంలో ఇలా విరాళాలు సేకరించటం ఎప్పుడైనా చూశారా..? అదే విధంగా ప్రయత్నించాడో ఓ పాకిస్తాన్‌ వ్యక్తి..! ఫేమస్‌ అవడానికి చేశాడో.. లేదా నిజంగానే విరాళాల కోసం ఇలా చేశాడో తెలియదు గానీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నవజాత శిశువుల ఆకలి తీర్చిన అమ్మకు గిన్నిస్‌ రికార్డ్‌

తల్లి పాల గొప్పతనం ఏంటో అందరికీ తెలుసు. బిడ్డ ఎదుగుదలలో అవి ఎంతో కీలకం. అయితే కొందరు పసిపిల్లలు వివిధకారణాలతో తల్లిపాలకు దూరం అవుతుంటారు. అలాంటి ఎంతోమంది పిల్లల ఆకలి తీర్చిందో మాతృమూర్తి. ఆమె సహృదయానికి గిన్నిస్‌ రికార్డూ దక్కింది. అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన ఎలిసాబెత్‌ అండర్సన్‌ సియోర్రాకు ఇద్దరు సంతానం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని