Congress: ‘జీతం తీసుకోని మీరు.. రోజుకు అన్ని లక్షలు ఎలా ఖర్చు చేశారు’’: మమత స్పెయిన్‌ పర్యటనపై కాంగ్రెస్‌

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పెయిన్‌ (Spain)పర్యటనపై కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరీ (Adhir Ranjan Chowdhury)విమర్శలు గుప్పించారు. 

Published : 25 Sep 2023 12:35 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పెయిన్‌ (Spain) పర్యటనపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరీ (Adhir Ranjan Chowdhury) విమర్శలు గుప్పించారు. ముర్షిదాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో డెంగీ (Dengue) కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. అయినా సీఎం ప్రజల సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారని అధిర్‌  ఆరోపించారు. ‘‘అక్టోబరు, నవంబరు నెలల్లో డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని మేం ముందుగానే ప్రభుత్వాన్ని హెచ్చరించాం. అయినా, ప్రభుత్వం ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. ఒకవైపు ప్రజలు డెంగీ, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతుంటే.. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పెయిన్‌ పర్యటనకు వెళ్లారు.  ప్రజల సమస్యను ఆమె అర్థం చేసుకోలేకపోతున్నారు’’ అని విమర్శించారు. 

24వ ప్రయత్నంలో రైతుబిడ్డకు.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

‘‘మమతా బెనర్జీ జీతం తీసుకోరని మేం విన్నాం. మరి మాడ్రిడ్‌లో ఉన్న విలాసవంతమైన హోటల్‌లో రోజుకు రూ.మూడు లక్షలు ఖర్చు చేశారు. మీకు ఇది ఎలా సాధ్యమైంది? మీ పర్యటనపై ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో తెలపండి? ఈ పర్యటన ఫలితంగా పెట్టుబడి పెట్టేందుకు ఒక్క పారిశ్రామివేత్తనైనా రాష్ట్రానికి తీసుకువచ్చారా?’’ అని అధిర్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని