ఆ నాలుగు గంటలే బంద్‌‌: రైతు సంఘాలు

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఈ నెల 8న తలపెట్టిన బంద్‌ను నాలుగు గంటలు మాత్రమే నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మంగళవారం......

Updated : 07 Dec 2020 16:31 IST

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఈ నెల 8న తలపెట్టిన బంద్‌ను నాలుగు గంటలు మాత్రమే నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్‌ జరుగుతుందని ప్రకటించాయి. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో బంద్‌ వేళలు నిర్ణయించినట్లు రైతుసంఘాలు పేర్కొన్నాయి.

మరోవైపు రైతు సంఘాలతో ఇప్పటి వరకు కేంద్రం జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతులు యథాతథంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. దేశరాజధాని సరిహద్దుల్లో చేస్తున్న ఆందోళన 12వ రోజుకు చేరింది. వీరి ఆందోళనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. రేపటి బంద్‌కు 14 రాజకీయ పార్టీలు బాసటగా నిలిచాయి. బంద్‌లో పాల్గొంటామని ఇప్పటికే ప్రకటించాయి. మరోవైపు రైతులు ఆందోళన చేస్తున్న సింఘు ప్రాంతాన్ని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం సందర్శించారు. రైతులకు మద్దతుగా యూపీలో ధర్నా చేపట్టిన సమాజ్‌వాద్‌ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి..
పోలీసుల అదుపులో అఖిలేశ్‌ యాదవ్‌
రైతుల వద్దకు కేజ్రీవాల్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని