మణిపుర్‌లో నగ్నంగా ఇద్దరు మహిళల ఊరేగింపు

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పోరుబాట పట్టిన వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి బుధవారం వెలుగులోకి వచ్చింది.

Published : 20 Jul 2023 03:55 IST

మేలో జరిగిన ఘటన వెలుగులోకి

ఇంఫాల్‌: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పోరుబాట పట్టిన వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో రాష్ట్రంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు వేడెక్కాయి. ఇండిజీనియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరం (ఐటీఎల్‌ఎఫ్‌) గురువారం నిరసన ర్యాలీ నిర్వహించాలని తలపెట్టిన తరుణంలో ఈ వీడియో వైరల్‌ కావడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఘటనను ఖండిస్తూ పలువురు రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు, గిరిజన నాయకులు పోస్టులు పెట్టారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీడియోలో కనిపించిన మహిళల చుట్టూ కొందరు పురుషులు నడుస్తూ వస్తున్నారు. వారంతా కలిసి సమీపంలోని పొలంలో బాధిత మహిళలపై అత్యాచారం చేశారని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది. మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లాలో మే 4న ఈ దారుణం చోటు చేసుకుంది. ఇందుకు ఒకరోజు ముందే ఆ రాష్ట్రంలో రెండు తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. గుర్తుతెలియని సాయుధ దుండగులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కింద నాంగ్‌పాక్‌ సెక్‌మై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని