మధ్యప్రదేశ్‌లో జలాశయం లీకేజీ

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో కరమ్‌ నదిపై నిర్మించిన జలాశయం నుంచి నీరు లీక్‌ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన రెండు హెలికాప్టర్లను

Published : 14 Aug 2022 05:53 IST

ధార్‌: మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో కరమ్‌ నదిపై నిర్మించిన జలాశయం నుంచి నీరు లీక్‌ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ గోడపై ఒత్తిడి తగ్గించేందుకు నీటిని సురక్షితంగా బయటకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. రూ.304 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో భాజపా ప్రభుత్వం అవినీతి మూలంగానే డ్యామ్‌ పనుల నాణ్యత లోపించిందని కాంగ్రెస్‌ విమర్శించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని