Viral video: కోతికి డ్రై డే మద్యం దొరికింది.. అదీ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగా..!

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రం కాన్పూర్‌లో గాంధీ జయంతి రోజున ఓ కోతికి మద్యం సీసా చిక్కిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 02 Oct 2023 17:49 IST

Image: Cow__Momma

లఖ్‌నవూ : అక్టోబరు 2న గాంధీ జయంతి అని అందరికీ తెలిసిన విషయమే. మహాత్ముడు జన్మించిన ఆ రోజున అన్ని రాష్ట్రాల్లోని అబ్కారీ శాఖ మద్యం అమ్మకాలను నిషేధిస్తుంది. ముందు రోజు మద్యం షాపులు, బార్లను సీజ్‌ చేస్తుంది. గాంధీ జయంతి తరువాతి రోజే ఆయా షాపులకు వేసిన సీల్స్‌ తెరుస్తారు. ఇందుకు భిన్నంగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రం కాన్పూర్‌లో గాంధీ జయంతి రోజున ఓ కోతికి మద్యం సీసా చిక్కిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అది కూడా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగానే చోటు చేసుకోవడం గమనార్హం.

‘డిసీజ్‌ ఎక్స్‌’ ముప్పు.. దొంగ వస్తాడని భయపడటం లాంటిదే..!

కోతి మద్యం సీసాను తెరిచి తాగడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆ వీడియోలో కన్పిస్తోంది. తొలుత తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ కోతి ఓ బైక్‌కు అమర్చిన సంచిలో శోధించింది. మద్యం సీసా కన్పించడంతో దాన్ని బయటకు తీసింది. ఆహారం కోసం అది వెతుకుతుండగానే దూరం నుంచి ఎవరో బిగ్గరగా అరవడంతో కోతి చేష్టలు చాలించి అక్కడి నుంచి పారిపోయింది. కిందపడిన మద్యం సీసాలను ఓ కానిస్టేబుల్ తిరిగి బైక్‌ సంచిలో పెట్టాడు. ఆ సీసాలు కానిస్టేబుల్‌వేనని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ బైక్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగానే పార్క్‌ చేసి ఉండటం విమర్శలకు దారితీసింది.

డ్రై డేను పాటించకుండా పోలీసులే ఇలా చేయడం ఏంటని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. దీనిపై కాన్పూర్‌ జాయింట్ కమిషనర్‌ ఆనంద్‌ ప్రకాశ్‌ స్పందించారు. వైరల్ వీడియో తన దృష్టికి రాలేదన్నారు. ఎవరి ద్విచక్ర వాహనాల్లో మద్యం సీసాలున్నాయో దర్యాప్తు చేస్తామని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని