Bengaluru: కాంట్రాక్టర్‌ సహా పలువురి ఇళ్లలో ఐటీ సోదాలు.. ₹50కోట్లు సీజ్‌!

IT Raids: కర్ణాటకలో గత మూడు రోజులుగా పలువురి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో రూ.50కోట్ల నగదు సీజ్‌ చేశారు.

Published : 15 Oct 2023 19:31 IST

బెంగళూరు: కర్ణాటకలో పెద్ద ఎత్తున ఐటీ అధికారులు దాడులు(IT Raids) జరిపారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ కాంట్రాక్టర్‌, అతడి కుమారుడు, జిమ్‌ యజమాని, ఆర్కిటెక్ట్‌ సహా పలువురి ఇళ్లల్లో జరిపిన సోదాల్లో రూ.50కోట్లకు పైగా నగదు సీజ్‌ చేసినట్టు ఐటీశాఖ అధికారులు వెల్లడించారు.  రెండు ప్రధాన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలకు సంబంధించి 25 చోట్ల గురువారం ప్రారంభమైన ఈ సోదాలు..  శనివారం సాయంత్రానికి  45 ప్రదేశాలకు చేరినట్టు  ఒక అధికారి ‘పీటీఐ’కి వెల్లడించారు. 

మన టెక్నాలజీని అమెరికా అడిగింది: ఇస్రో చీఫ్‌

పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు సహకారనగర్, సంజయ్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కొన్ని  దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ రెండు సంస్థల్లో సోదాల ఆధారంగా లభ్యమైన సమాచారంతో  పలువురు కాంట్రాక్టర్లు, ఇతర వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. నిన్నటివరకు మొత్తంగా 45చోట్ల సోదాలు నిర్వహించగా.. శనివారం ఒక్కరోజే ఒక ఆర్కిటెక్ట్‌, జిమ్‌ యజమాని ఇళ్లల్లో జరిపిన సోదాల్లో రూ.8కోట్లు నగదు పట్టుబడిందన్నారు. దీంతో  మొత్తంగా సీజ్ చేసిన నగదు  రూ.50కోట్లకు చేరిందని తెలిపారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. 

గత భాజపా సర్కార్‌పై 40శాతం కమీషన్‌ ఆరోపణలు చేసిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌ ఇంటిపై ఐటీ దాడులు జరిగినట్టు భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై భాజపా విరుచుకుపడుతోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత  సీటీ రవి మాట్లాడుతూ..  లంచాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నందున ఇళ్ల నిర్మాణం చేస్తున్న ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి నీటి కనెక్షన్ నిరాకరించిన సందర్భం కూడా ఉందన్నారు.  చదరపు అడుగుకు రూ.100 చొప్పున లంచం ఇవ్వాలని అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని