Rahul Gandhi: ‘ఆయన మాకు అవసరం లేదు’: నీతీశ్‌ యూటర్న్‌పై రాహుల్‌ రియాక్షన్‌

కులగణనపై తాము ఒత్తిడి చేయడం వల్లే నీతీశ్‌ కుమార్ మరోసారి భాజపాతో పొత్తు పెట్టకున్నారని రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) అన్నారు. 

Published : 30 Jan 2024 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విపక్ష ‘ఇండియా’ కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar)ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దుయ్యబట్టారు. ‘మాకు నీతీశ్‌ కుమార్ అవసరం లేదు. ఆయనపై ఒత్తిడి రావడంతో యూటర్న్‌ తీసుకున్నారు’ అని భారత్‌ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో భాగంగా మొదటిసారి స్పందించారు.

‘నీతీశ్‌ ఎందుకు విపక్ష కూటమిని వీడారో తెలుసు.  బిహార్‌లో కులగణన చేపట్టాలని మేం ఆయనకు స్పష్టంగా చెప్పాం. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ ఒత్తిడి తీసుకువచ్చింది. అందుకు భాజపా భయపడింది. ఆ పార్టీ దీనికి వ్యతిరేకం. నీతీశ్‌ ఇరుక్కుపోయారు. పారిపోవడానికి భాజపా ఆయనకు దారి చూపించింది. సామాజిక బాధ్యత అందించడం కూటమి బాధ్యత. దానికి నీతీశ్‌ అవసరం లేదు. కొంచెం ఒత్తిడి వచ్చినా ఆయన యూటర్న్‌ తీసుకుంటారు’ అని విమర్శించారు.

రాంచీకి చేరుకున్న సోరెన్‌.. సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్‌

2020 శాసనసభ ఎన్నికల తర్వాత నీతీశ్‌ మూడోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మహాకూటమి, విపక్ష కూటమిలో కొన్ని విషయాలు నచ్చకపోవడం వల్లే భాజపాతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. మిత్రపక్షాలను మార్చడం ద్వారా బిహార్‌లో సుదీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న నీతీశ్‌.. భాజపాకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అయితే, ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటినుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కూటమిని వీడినట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని