Mamata: అరుణ్‌ గోయెల్‌కు ‘సెల్యూట్‌’ : మమతా బెనర్జీ

భాజపా ఒత్తిడికి లొంగిపోలేదంటూ ఎన్నికల కమిషనర్‌ పదవికి రాజీనామా చేసిన అరుణ్‌ గోయెల్‌ (Arun Goel)పై మమతా బెనర్జీ ప్రశంసలు గుప్పించారు.

Updated : 10 Mar 2024 17:39 IST

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ (Arun Goel) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. భాజపా ఒత్తిడికి లొంగిపోలేదంటూ గోయెల్‌పై ప్రశంసలు కురిపించిన దీదీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాషాయదళానికి ఓటమి ఖాయమన్నారు. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. వచ్చే ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

‘ఎవరినో రక్షించడానికే ఎస్‌బీఐ ప్రయత్నం’ - కపిల్‌ సిబల్‌

‘లోక్‌సభ ఎన్నికలు, పశ్చిమబెంగాల్‌లో కేంద్ర బలగాల మోహరింపునకు సంబంధించి దిల్లీ నేతల (భాజపా) నుంచి వచ్చిన ఒత్తిళ్లకు లొంగనందుకు అరుణ్‌ గోయెల్‌కు సెల్యూట్‌ చేస్తున్నా. ఎన్నికల పేరుతో వాళ్లు(ఎన్డీయే ప్రభుత్వం) ఏం చేయాలనుకుంటున్నారో దీంతో రుజువైంది’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేస్తున్నారని.. నిధులు మాత్రం విడుదల చేయడం లేదని విమర్శించారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుపై స్పందిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌, భాజపా, సీపీఎంలకు వ్యతిరేకంగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు. అస్సాం, మేఘాలయాల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. యూపీలో ఒకచోట పోటీపై ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని