Karnataka: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్‌, రేవణ్ణలపై కేసు

మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ తనయుడు రేవణ్ణతోపాటు ఆయన మనవడు, హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

Published : 28 Apr 2024 21:57 IST

బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ (Deve Gowda) తనయుడు రేవణ్ణ (Revanna)తోపాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)లపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్‌ పోలీసులు ఈమేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ అంశంపై సిట్‌ను ఏర్పాటు చేయాలని అంతకుముందు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

భారత్‌ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హసన్‌ స్థానం నుంచి ప్రజ్వల్‌ మరోసారి బరిలో దిగారు. ఏప్రిల్‌ 26నే ఈ స్థానానికి పోలింగ్‌ ముగిసింది. అయితే.. పోలింగ్‌కు ముందు నుంచే ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు హసన్‌ జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల నడుమ ఆయన ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరి వెళ్లడం గమనార్హం. రేవణ్ణ పేరు చెడగొట్టడానికే కొంత మంది కలిసి ఈ క్లిప్‌లను వ్యాప్తి చేశారని జేడీఎస్‌-భాజపా ఎలక్షన్‌ ఏజెంట్‌ పూర్ణచంద్ర గౌడ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందిస్తూ.. సిగ్గుతో తలదించుకుంటున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని